DPRO NIRMAL: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది 26.082021

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
ఈ సందర్బంగా గురువారం జిల్లా పాలనాధికారి కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల కలెక్టర్లకు చాలెంజ్ విసిరారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ మొక్కలను పెంచడం వల్ల భావితరాలకు అక్షయపాత్ర వంటిదని, పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు.
దూరదృష్టి తో ఆలోచించి, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకు వెళుతున్న సంతోష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, తదితరులు ఉన్నారు.

***********************************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post