DPRO NIRMAL: రాష్ట్రం లోనే ప్రప్రథమంగా నిర్మల్ లో ఎల్ ఇ డి స్క్రీన్ ఏర్పాటు: రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి .

 

 

పత్రికా ప్రకటన తేది: 22.12.2021
రాష్ట్రం లోనే ప్రప్రథమంగా నిర్మల్ లో ఎల్ ఇ డి స్క్రీన్ ఏర్పాటు: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 4కె క్వాలిటీ ఎల్ఇడి స్క్రీన్ 8/12 సైజు లో బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల వివరాలు, వాటి లక్ష్యాలు ఈ ఎల్ఈడీ స్క్రీన్ పై సాయంత్రం 4.00గం॥ల నుండి రాత్రి 11.00 గం॥ ల వరకు ప్రదర్శింపబడుతాయిన్నారు . దీని ద్వారా ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందుతుందని మంత్రి ఆకాక్షించారు.రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిర్మల్ జిల్లాలో ఎల్ఈడీ స్క్రీన్ ను ప్రారంభించడం జిల్లావాసిగా తనకు ఆనందంగా ఉందన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, కోవిడ్ నియంత్రణ చర్యలు, కుటుంబ సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమం తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎల్ఈడీ తెరపై ప్రదర్శింప పడతాయని అన్నారు.
జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి చొరవతో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే కృషివల్ల రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఎల్ఈడీ స్క్రీన్స్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ట్రీ అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి
సామాజిక మొక్కల పెంపకం కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఎక్కడైనా ఎండిపోయిన, పడిపోయిన పక్షంలో ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఎల్లప్పుడూ ఆంబులెన్స్లో మొక్కలు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ప్రకృతి ని పచ్చదనం ను కాపాడుట అందరి బాధ్యత అన్నారు. మనుషులకు అంబులెన్స్ లు ఉన్నాయి కానీ మొక్కలకు ఆంబులెన్సులు ఇదే ప్రథమమని మంత్రి అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించటం మరియు ట్రీ గార్డులను సవరించడం కోసం ఏర్పాటు చేయనైనదని అన్నారు. వ్యక్తులకు ఆంబులెన్స్ ఉంటుంది కానీ మొక్కలకు ఆంబులెన్స్ కొత్త ఆలోచన అని ఇది కూడా మన జిల్లాలోనే మొట్టమొదటి సారిగా ప్రారంభించడమైందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్ పెర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్కడే, శ్రీ పి. రాంబాబు, డీఆర్డీవో పిడి విజయలక్ష్మి, ఆర్డీవో శ్రీ రాథోడ్ రమేష్, ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
********************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post