DPRO NIRMAL: రూ. 60 లక్షల ఖర్చుతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు: భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి :

పత్రికా ప్రకటన తేదీ:07.10.2021
*రూ. 60 లక్షల ఖర్చుతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు: భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి :
నిర్మల్ జిల్లా నర్సాపూర్( జి )మండల కేంద్రంలో రూ. లు 60 లక్షల ఖర్చుతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి తెలిపారు.
గురువారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గల రోడ్డు డివైడర్ పై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు కు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పెట్రోల్ పంప్ వరకు జాతీయ రహదారి 222 పై ఒక కి.మీ. పొడవునా 44 లైట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒకే రకమైన మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు వల్ల మండల కేంద్రం సుందరంగా తయారవుతుందన్నారు.వెలుతురు ఉన్న చోట అభివృద్ధి ఉంటుందని లేని చోట ప్రమాదాలు, మరియు చెడు పనులు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ అన్నారు. గ్రామస్థులు పరిశుభ్రత మీద కూడా దృష్టి సారించాలని కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పల్లె ప్రకృతి వనాలు మరియు పల్లె ప్రగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారని తెలిపారు. భైంసా పట్టణం అభివృద్ధి, లైటింగ్ వ్యవస్థ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందన్నారు. అదేవిధంగా ఒక దాని తర్వాత ఒక కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ది చేయుటకు అందరూ కృషి చేయాలని తెలిపారు. నర్సాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణను పరిశీలించి అక్కడి పరిశుభ్రత మరియు మొక్కల పెంపకం చూసి కలెక్టరు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్కడే, నర్సాపూర్ సర్పంచ్ శ్రీ అరుగుమీది రామిరెడ్డి, ZPTC శ్రీ ఏ రామయ్య, MPP శ్రీమతి రేఖ, MRO శ్రీ తుకారం తదితరులు పాల్గొన్నారు.

*****************జారీ చేయువారు జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్.

Share This Post