DPRO NIRMAL: రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే పండించుటకు మొగ్గుచూపాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పత్రికా ప్రకటన తేది: 01.11.2021

రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే పండించుటకు మొగ్గుచూపాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లాలో దిలా వర్పూర్ , నర్సాపూర్ (జి) మండల కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గిడ్డంగులలో ధాన్యం నిల్వలు పేరుకు పోయి ఉన్నందున రైతులు రెండవపంట కింద వరి సాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారుల సలహాలు సూచనలు మేరకు వేరుశనగ, శనగ, నువ్వులు తదితర పప్పుధాన్యాలు పండిస్తే రైతులకు ఇబ్బంది ఉండదని సూచించారు. విదేశాలలో పండించని పంటలు ఇక్కడ సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తుందన్నారు. జిల్లాలో రైతుబంధు కింద 6660 మంది లబ్ధి పొందుతున్నరన్నారు. ప్రభుత్వం రెండు పంటలకు రైతు బంధు కల్పిస్తుందన్నారు. పత్తి రైతుకు ధర గిట్టుబాటు అయినచోట అమ్ముకోవచ్చన్నారు
నిర్మల్ నియోజకవర్గంలో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడమైనదని, దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాలయాల నిర్మాణానికి ప్రజల వాటా ధనం 20% ఉన్నప్పటికీ మినహాయింపు చేసి దేవాలయాల నిర్మాణాలు జరిపిస్తున్నట్టు మంత్రి అన్నారు. యాదాద్రి ఆలయం రూ. లు 1200 కోట్ల ఖర్చుతో నిర్మించడమైనదని అన్నారు. నవంబర్ 6న అక్కడి ఉత్సవ విగ్రహాలను నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియం లో కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కొరిపెల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులు దళారుల పాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రతి కుటుంబం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. అన్ని రంగాల్లో నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో నడిపించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ వెంకట్రామిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వి రమణారెడ్డి, జెడ్పీటీసీలు, దిలావర్పూర్ ఎంపీపీ ఇన్ఛార్జి బాబూరావు, సర్పంచులు రాంరెడ్డి, వీరేష్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారినిమరియు జిల్లా మేనేజర్ కుమారి సుధారాణి, తహశీల్దార్ హిమబిందు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post