DPRO NIRMAL: వడ్యాల్ PHC భవనానికి మంత్రి శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

పత్రికా ప్రకటన తేది :12.10.2021
వడ్యాల్ PHC భవనానికి మంత్రి శంకుస్థాపన
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలం వడ్యాల్ గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ సబ్ సెంటర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినప్పటికీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలు కొనసాగిస్తుందని అన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద 1 లక్ష 116 ఇస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులకు 30% PRC ఇచ్చిందని అన్నారు. వడ్యాల్ గ్రామపంచాయతీకి 2 లక్షల 75 వేల నిధులు కేటాయించారని తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మంత్రి అన్నారు. అనంతరం మంత్రి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్యాల్ సర్పంచ్ లలిత, ఉపసర్పంచ్ మోహన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధన్ రాజ్, MRO కవితారెడ్డి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— జారీ చేయువారు: జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్.

Share This Post