DPRO NIRMAL: వయో వృద్ధులు చట్టాల పై అవగాహన కలిగిఉండాలి అదనపు కలెక్టర్ పి. రాంబాబు.

పత్రిక ప్రకటన తేది 08.10.2021

వయో వృద్ధులు చట్టాల పై అవగాహన కలిగిఉండాలి అదనపు కలెక్టర్ పి. రాంబాబు
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనగావించి మాట్లాడుతూ వయో వృద్ధులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని, చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను పిల్లలు తప్పనిసరిగా గౌరవించాలని కోరారు. ఏమైన సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 14567కి కాల్ చేయవచ్చని తెలిపారు. బ్యాంక్, ఆసుపత్రులలో వృద్ధుల కొరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని, మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. అనంతరం వయోవృద్ధుల కు సన్మానం చేశారు.
అంతకుముందు వయోవృద్దుల కష్టనష్టాలను, తీసుకోవలసిన జాగ్రత్త లపై సీనియర్ సిటిజన్ బాపూరావు తన పాట రూపంలో ఎంతో చక్కగా వినిపించారు.

సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ సంక్షేమ అధికారి స్రవంతి , విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి , జనరల్ సెక్రెటరీ యంసి లింగన్న,
ఎ యస్ పి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి దన్ రాజ్, drda ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, dpro ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.

*************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post