DPRO NIRMAL: వాక్సినేషన్ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి చేయాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.

పత్రిక ప్రకటన
తేది 01.12.2021
నిర్మల్ జిల్లా బుధవారం

మండలాల్లో, గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటుచేసి మొదటి, రెండవ డోసులు డిసెంబర్ 31 ఈ నెల చివరి నాటికి తప్పనిసరిగా వంద శాతం వాక్సినేషన్ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి చేయాలి. ,,,,,,,,,,,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.

బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ గార్లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెరియంట్ ఒమ్రికాన్ అనే కొత్త వారియెంట్ కొన్ని దేశాల్లో బయట పడిందని ,ఇది మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రెండు డోసులు కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని కోరారు. వాక్సిన్ తీసుకోని వారంతా కోవిడ్ బారిన పడే ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లే అని తెలిపారు. మూడవ దశ ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినషన్ రెండు డొసులు వంద శాతం పూర్తి ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ అయితే తక్కువ వ్యాక్సిన్ వేశారో గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీ లలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు ఆరోగ్య పరమైన పోటీ తత్వం పెంచాలని సూచించారు. దేశములోనే వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు కలెక్టరులు, వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ మంత్రి సూచించారు. మొదటి, రెండు డోస్ లు ప్రతి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకునేలా చూడాలని తెలిపారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని, మండలాన్ని, మున్సిపల్ వార్డును, జిల్లాను వంద శాతం వ్యాక్సిన్ అయినట్లుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మనమందరం మొదటి రెండు దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూడవ దశను ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని, అసత్య ప్రచారాలు, అపోహలు ప్రజలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మీకు అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలలో ఎన్ని బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయన్న సమాచారం ప్రజలకు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.

విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గురుకులాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అంత రెండు డోసులు వాక్సినేషన్ తీసుకోనేలా,విద్య సంస్థలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్ లు విద్యా శాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని, 18సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి అని అన్నారు.

జిల్లా పాలనాధికారి ముష రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు 78 శాతం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని, రెండవ డోసు 33 శాతం శాతం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంకా మొదటి డోస్ 1 లక్ష 15 వేల మంది టీకా తీసుకోలేదని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి చేస్తామని, మూడవ దశ రాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా వైద్య, ఆరోగ్య శాకాధికారి డాక్టర్ ధనరాజ్, జడ్పీ సి.ఈ ఓ , సుధీరకుమార్ , డ్.పి.ఓ,పి.డి.డి.ఆర్.డి.ఓ, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post