DPRO NIRMAL: వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి. టీకాయే కోవిడ్ ను సమర్ధవంతంగా నిర్ములుస్తుంది…. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

పత్రికా ప్రకటన తేది: 16092021

వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి. టీకాయే కోవిడ్ ను సమర్ధవంతంగా నిర్ములుస్తుంది జిల్లా కలెక్టర్ ముషరాఫ్ అలీ ఫరూకీ. గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ ముషరాఫ్ ఫరూకీ జిల్లా లోని ముధోల్,లోకేశ్వరం మండలాలలోని వాక్సినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ముధోల్ మండలం లోని మక్చల్, తెలంగి తరోడా గ్రామా లలో లోకేశ్వరం మండలం లొని రాయపూర్ కండ్లి, గోడిసెర మరియు ధర్మోరా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి నూటికి నూరు శాతం వాక్సిన్ లక్ష్యంగా వేయాలన్నారు. వాక్సిన్ తీసుకున్నవారు వేసుకొని వారిని ప్రోత్సహించాలని,వాక్సిన్ వల్ల కరోనా ను సమర్థవంతంగా ఎదురుకోవచ్చని గ్రామస్తులకు తెలిపారు. వాక్సిన్ ప్రక్రియ ను వేగవంతం చేయాలనీ స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్ఖడే, ముధోల్ mro శివ కుమార్ లోకేశ్వరం mro లోకేశ్వర్ ఎంపీడీఓ లు హాజరైనారు.

************************** జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post