DPRO NIRMAL: విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

పత్రికా ప్రకటన తేది: 01.09.2021

విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి…

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

0000

విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఉపాధ్యాయులను, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం పాఠశాలలు పున: ప్రారంభమైన నేపథ్యంలో సారంగాపూర్ మండలం చించోలి [బి], ధని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పూర్తిస్థాయిలో ఉండాలని అన్నారు. తరగతులకు హాజరైన విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వలన ఇప్పటికే విద్యా సంవత్సరం వృధా అయిందని ఇకపై కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ చదువుకోవాలన్నారు. అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, నిరంతరాయంగా బోధన జరగాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యాక్సినేషన్ తీసుకోవాలని లేనిచో వేతనం నిలిపివేయబడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ప్రణీత, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

***************************జిల్లా పౌరాసంబంధాల అధికారి నిర్మల్ చే జారిచేయనైనది.

Share This Post