DPRO NIRMAL: వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం…. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు.

పత్రిక ప్రకటన
తేదీ 06.11.2021
నిర్మల్ జిల్లా శనివారం

నిర్మల్ జిల్లా లో శ్రీ యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి వారి కల్యాణ మహోత్సవం శనివారం సాయంత్రం 6.00గంటలకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో యాదాద్రి ఆలయ అర్చకులచే రాష్ట్ర మంత్రివర్యు ల పుణ్య దంపతులు శ్రీమతి అల్లోల విజయలక్ష్మి – ఇంద్రకరణ్ రెడ్డి గార్ల సమక్షంలో పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది.

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు తమ స్వ‌గృహంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌ర్సింహ‌స్వామి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలో పాల్గొన్నారు. యాద‌గిరీశుని క‌ళ్యాణ‌మ‌హోత్స‌వ వేడుకల‌ నేప‌థ్యంలో ఉత్స‌వ విగ్ర‌హాల‌ను నిర్మ‌ల్ కు తీసుకువ‌చ్చారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కుటుంబ స‌భ్యులు హ‌రతినిచ్చి స్వాగ‌తం ప‌లికారు.

ఈ కార్యక్రమం లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, పి. రాంబాబు, జడ్పీ ఛైర్పర్సన్ లు నిర్మల్ , ఆసిఫాబాద్ విజయలక్ష్మి, కోవలక్ష్మి, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post