DPRO NIRMAL: సందర్మాట్ బ్యారేజ్ నిర్మాణంలో నష్టపోయిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది 22.09.2021

సందర్మాట్ బ్యారేజ్ నిర్మాణంలో నష్టపోయిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

బుధవారం మామడ మండలం లోని పో న్కల్ గ్రామంలో నిర్వహించిన భూ నష్ట పరుహారం పంపిణి కార్యక్రమంలో మంత్రి, జిల్లా పాలనాధికారి, అదనపు కలెక్టర్ లు హేమంత్, పీ. రాంబాబు, ఖానాపూర్, ముధోల్ ఎ మ్మెల్యే లు రేఖా శ్యామ్ నాయక్, విఠల్ రెడ్డి, రామ్ కిషన్ లు భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణి చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మామడ మండలం లోని పో న్కల్ గ్రామ గోదావరి పై నిర్మిస్తున్న సందర్మాట్ బ్యారేజీ నిర్మాణం లో నష్టపోయిన రైతులు 487 మందికి 38 కోట్ల 61 లక్షల 46 వేల 125 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని
అంతకుముందు 254 మంది కి 35 కోట్ల 52 లక్షల 67 వేల 250 రూపాయలు 350 ఎకరాల 16 గుంటలను భూ నిర్వాసితులకు అందించడం జరిగిందని అన్నారు.
మొత్తం 74 కోట్ల 14 లక్షల 13 వేల 375 పరిహారం చెల్లించడం జరిగుతుందని తెలిపారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి, ఎవరు నష్టపోకుండా అందరికి నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుందని ఈ రోజు 50 మందికి చెక్కులు పంపిణి చేయడం జరిగిందని మిగితా వారికి వారి వారి ఖాతా లలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమం లో డీస్పీ జీవన్ రెడ్డి,dwo స్రవంతి, తహసీల్దార్ కిరణ్మయి, ఇరిగేషన్ ad సుశీల్ కుమార్, మార్కెట్ చైర్మన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

********************జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది

Share This Post