పత్రికా ప్రకటన
నిర్మల్ జిల్లా
సెప్టెంబర్,12.
*సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను సన్మానించిన: జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే.
దేశ రక్షణలో సి.ఆర్.పి.ఎఫ్ దళాలు త్రివిధ దళాలు నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని, కష్టమైనవి కూడా అని జిల్లా ఎస్పీ సిహెచ్. ప్రవీణ్ కుమార్ అన్నారు. 21 మంది సభ్యులతో కూడిన సి.ఆర్.పి.ఎఫ్ టీమ్ భారతీయ సమైక్యత ఆజాదీకి మహోత్సవం కార్యక్రమాల అవగాహాన ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశ్యంతో కన్యాకుమారి నుండి ఢిల్లీలోని రాజ్ ఘాట్ వరకు ఆగష్టు 22 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే సైకిల్ ర్యాలీ శనివారం నిర్మల్ జిల్లాకు చేరుకున్న టీంను జిల్లా ఎస్పీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ , అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే , అదనపు ఎస్పీ రాంరెడ్డి, ,మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి తదితరులు వారిని ఘనంగా స్వాగతం పలికి జిల్లాకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆదివారం రోజున శ్యంగడ్ వద్ద ఏర్పాటు చేసిని కార్యక్రమంలో మాట్లాడుతూ…. ఈ బృందానికి పోలీసు యంత్రాoగము తరపున పూర్తి సహాయ సహకారాలు అందంచడం జరుగుతుందని 2850 కిలోమీటర్ల ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నదని , వారి ధైర్యానికి, చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరం ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. భారతదేశ రక్షణలో త్రివిధ దళాలు ఎన్నో సమస్యలను ప్రతిఘటిస్తూ దేశ రక్షణలో వారి జీవితాలను పనంగా పెడుతున్నారని, దేశ ప్రజలను, దేశాన్ని కాపాడుతుoన్నారని ప్రశంసిచారు. ఈ బృందంలో ఇద్దరికీ గతంలో జరిగిన ప్రమాదం సందర్భంగా కాలు పోగొట్టుకున్నప్పటికి అకుంఠిత దీక్షతో వారు ఈ టీమ్ సభ్యులతో ఈ యాత్రలో పాలుపంచుకోవడం అద్వితీయమని ప్రస్తుతించారు.
అనంతరం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే మాట్లాడుతూ ఈ బృందం జాతీయ సమైక్యత ఆజాదీకి మహోత్సవం దేశభక్తి కార్యక్రమం సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపొందిచడానికి ప్రయాణం చేయడం ఎంతైనా అభినంధనీయమని వారికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్యంగడ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విధ్యార్ధులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.