DPRO NIRMAL: సురక్షిత వాతావరణంలో గణేష్ పండుగను జరుపుకోవాలి….జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది 09.09.2021
సురిక్షిత వాతావరణం లో గణేష్ పండుగ ను జరుపుకోవాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, sp ప్రవీణ్ కుమార్.
గురువారం జిల్లా పాలానాధికారి సమావేశ మందిరంలో పోలీస్, మున్సిపల్, ఉత్సవ సమితి, సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి, sp తో కలిసి నిర్మల్ పట్టణంలో గణేష్ చతుర్థి పండుగ, గణేష్ నిమజ్జనం ముందుస్తు ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు, నిర్వాహకులు భక్తి శ్రద్దలతో సురిక్షిత వాతావరణం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి కోవాలని, మండపాల నిర్వాహకులు సానిటైసార్, భౌతిక దూరం,మాస్క్ లు దరుంచే లా తగు జాగ్రత్త లు పాటించాలని అన్నారు.
గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో గుంతలు పడిన రహదారులు, ప్యాచ్ వర్క్ రిపేర్ పనులు, గణేష్ నిమజ్జనం నిర్వహించే ప్రదేశాల వద్ద క్రెన్ లు, బారికేడింగ్, వేదిక ఏర్పాట్లు మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖ అధికారులు కలసి చేపట్టాలని, అధికారులు అందరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.
Sp మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణిత సమయంలో పూజలు ముగించుకొని నిమజ్జనానికి బయలుదేరాలని, విగ్రహాలు ఊరేగింపు సమయంలో వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జనం సమయంలో రోడ్డు మారమ్మత్తులు, వ్రే్లాడే తీగలు, వంగి ఉన్న చెట్లు, తదితర వాటిని తొలిగించాలని తెలిపారు. ముందుగా నిర్వాహకులు అప్లికేషన్ అప్ లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ఒక్క రోజులోనే నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యే విధంగా అందరు సహకరించాలని అన్నారు.
ఈ సమావేశం లో adl sp రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఉత్సవ సమితి నిర్వాహకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

*****************************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post