DPRO NIRMAL: సెప్టెంబర్ 1 నుండి పాఠశాల లు ప్రారంభం కానున్న సందర్బంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి…అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,

పత్రిక ప్రకటన
తేది 30.08.2021

సెప్టెంబర్ 1 నుండి పాఠశాల లు ప్రారంభం కానున్న సందర్బంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి…

శాంతియుత వాతావరణం లో ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, sp ప్రవీణ్ కుమార్.
సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో పాఠశాల ప్రారంభం, గణేష్ పండుగ సందర్బంగా నిర్వహించిన సమావేశం లో మంత్రి, కలెక్టర్, sp లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎల్లుండి నుండి సెప్టెంబర్ 1నుండి బడులు పున :ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పించాలని, కోవిడ్ నియమ నిబందనలు పాటించాలని, అన్ని పాఠశాల లు పరిశుభ్రంగా ఉండాలని , ప్రభుత్వ, ప్రయివేట్, అంగన్వాడీ స్కూల్స్ లో టీచర్లు, ఆయాలు హాజరవ్వాలని ఆదేశించారు.
అలాగే వైద్యాధికారులు డెంగ్యూ నివారణ కు చర్యలు చేపట్టాలని ఇప్పటి వరకు 92 కేసులు నమోదు కావడం జరిగిందని అన్నారు.

సెప్టెంబర్ 10వ తేదీన గణేష్ పర్వదినం ప్రారంభం సందర్బంగా గణేష్ ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని, నిమజ్జనం సమయంలో సమయపాలన పాటించాలని, అన్నారు.

జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఎల్లుండి నుండి ప్రారంభమయ్యే పాఠశాలలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ప్రతి తరగతి గదితో పాటు బెంచీలు, ఆవరణల, పారిశుధ్య పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని ప్రతి రోజు వారికి కేటాయించిన మండలం లో పర్యటించి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ టీచర్లు, అంగన్వాడీ టీచర్లు కోవిడ్ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని, లేనియెడల ఆగస్టు జీతం నిలిపి వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
డెంగ్యూ నివారణ లో భాగంగా ప్లడ్ ఫీవర్ సర్వేను నిర్వహించడం జరిగిందని ముఖ్యం గా గాజులపేట, శాంతినగర్, సోఫినగర్ తదితర కాలనీలలో ప్రత్యేక ద్రుష్టి సారించి స్ప్రే చేయించడం జరుగుతుందని తెలిపారు. గణేష్ ఉత్సవాలను పకడ్బెందిగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతామని అన్నారు.
Sp మాట్లాడుతూ గణేష్ పండుగను శాంతియుతంగా ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అందరి సహాయ సహకారాలతో, సమన్వయం తో పండుగను విజయవంతం గా జరుపుకోవాలని అన్నారు.
ముఖ్యంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే సమయంలో పోలీస్ అనుమతి తో ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని, షార్ట్ షర్ క్యూట్ జరగకుండా అప్రమత్తం గా ఉండాలని అన్నారు.
ముఖ్యంగా మండపాల వద్ద డి. జె. లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాట్లు చేయవద్దని, డి. జె. లకు అనుమతి లేనందున ఎవరుకూడా ఏర్పాట్లు చేయవద్దని దీనిని అందరు గమనించాలని తెలిపారు.

ఈ సమావేశం లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ లు ఈశ్వర్, రాజేందర్, బైంసా వైస్ చైర్మన్ జాబిద్ అహమ్మద్ , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

********************************జిల్లా పౌర సంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post