DPROADB- అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కలెక్టరేట్ సిబ్బంది పూల మొక్కలు, పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2021 సంవత్సరంలో రెండు నెలల పాటు ఇంచార్జి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిచడం జరిగిందని, అదే సమయంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విధులు నిర్వహించవలసి వచ్చిందని తెలిపారు. జిల్లాలో మాత శిశు మరణాలను తగ్గించే విధంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం మరణాలు తగ్గాయని అదేవిదంగా ఆదిలాబాదు జిల్లాలో కూడా సమిష్టి కృషితో జీరో స్థాయికి తీసుకురావాలని అన్నారు. గిరిజన జిల్లాలో పనిచేయడం సంతృప్తీ కరంగా ఉంటుందని, మరో గిరిజన ఆదిలాబాదు జిల్లాలో పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి శాఖల సమన్వయం అవసరమని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అన్నారు. త్వరలో శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తానని, దేశంలో జిడిపి ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలో కూడా ప్రగతి అంశాలపై సమీక్షలు ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం సాధించిన ప్రగతి కంటే ఈ సంవత్సరం 15 నుండి 20 శాతం ఎక్కువ ప్రగతి సాధించే విధంగా యంత్రాంగం పని చేయాలనీ అన్నారు. గత రెండు సంవత్సరాల ప్రగతి నివేదికల ఆధారంగా ఈ సంవత్సరం ఆక్షన్ ప్లాన్ నిర్దేశించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, ట్రైనీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓలు రమేష్ రాథోడ్, కదం సురేష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post