DPROADB- అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లో పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పథకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారుల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అనీమియా సమస్యను తగ్గించడం జరిగిందని తెలిపారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద మొదటి దశలో 237 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని, 37 మోడల్ పాఠశాలలుగా గుర్తించి మౌళిక సదుపాయాల పనులు పూర్తిచేయడం జరిగిందని వారం పదిరోజుల్లో ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో 33 టీమ్ లతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రతి రోజు సుమారు 5500 మందికి స్క్రీనింగ్ నిర్వహించి అవస్సరమైన వారికీ రీడింగ్ కళ్లద్దాలు వెంటనే అందజేస్తున్నామని, ప్రిస్క్రిప్టెడ్ అద్దాలు త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో అమలు పరుస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా జిల్లాలో ఐక్యంగా జీవిస్తున్నామని, స్వాతంత్య్ర ఫలాలను మనం అనుభవిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాదు శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, సమాజానికి అవసరమైన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలు పరుస్తున్నదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు సాధిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అందరి సహకారంతోనే జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ జరుగుతున్నదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు పొందుతున్నామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100 కు డయల్ చేయాలనీ ఆయన తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రగతి సాధించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, ASP హర్షవర్ధన్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

 

అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ పతాకావిష్కరణ నిర్వహించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను కలెక్టర్ అందజేసి, స్వీట్ లు పంచారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రమేష్ రాథోడ్, క్యాంపు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ భవనం పై అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ అరవింద్ కుమార్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post