అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుండి ప్రారంభిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమ అవగాహన సైకిల్ ర్యాలీ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమంపై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించడం జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఈ నెల 8 న ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గ కేంద్రాలలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఆయా వైద్య శిబిరాలలో మహిళా వైద్యులు, సిబ్బంది వైద్యం అందిస్తారన్నారు. మహిళలు ఆరోగ్యాంగా ఉంటేనే కుటుంబం తో పాటు సమాజం ఆరోగ్యాంగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగానే ఆరోగ్య మహిళా, ఆరోగ్య తెలంగాణ నినాదంతో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్య చికిత్సలను అందించనున్నామని, ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు డా.సాధన, మనోహర్, గిరిజన క్రీడల అధికారి పార్థసారధి, వైద్య సిబ్బంది, అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.