DPROADB- కంటి వెలుగు కార్యక్రమంపై గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించి అడల్ట్ ప్రజలందరూ పరీక్ష చేయించుకునే విధంగా ప్రోత్సహించాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కంటి వెలుగు కార్యక్రమంపై గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించి అడల్ట్ ప్రజలందరూ పరీక్ష చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున జైనథ్ మండలం గిమ్మ, బేల మండలం సిర్సన్న గ్రామాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో ఏ ఒక్కరు మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించుకునే విదంగా గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు, రీడింగ్ కళ్లద్దాలు, డాక్టర్లు సిఫారసు చేసిన ప్రిస్క్రిప్టెడ్ అద్దాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. గిమ్మ గ్రామంలో ఇప్పటి వరకు 108 రీడింగ్ గ్లాసులు అందజేసినట్లు, 88 ప్రిస్క్రిప్టెడ్ గ్లాసులకు ఆర్డర్ పంపడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సిర్సన్న గ్రామంలో 82 రీడింగ్ గ్లాసులు పంపిణి చేశామని, 69 ప్రిస్క్రిప్టెడ్ అద్దాలకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పంపించామని ఆయా మెడికల్ ఆఫీసర్లు కలెక్టర్ కు వివరించారు. క్యాంపు ప్రారంభంలో ఆర్డర్ చేసిన ప్రిస్క్రిప్టెడ్ గ్లాసులు సంబంధిత వ్యక్తులకు వస్తున్నాయని ఆయా గ్లాసులు ఆశ కార్యకర్తల ద్వారా లబ్దిదారులకు పంపిణి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మండల తహసీల్దార్లు రాఘవేందర్ రావు, రాంరెడ్డి, ఎంపీడీఓ లు గజానంద్, ఎంపీపీ ఎం.గోవర్ధన్, ఎంపీఓ, స్థానిక సర్పంచ్ లు, మెడికల్ ఆఫీసర్ లు, వైద్య సిబ్బంది, కంటి వెలుగు టీమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post