జిల్లాలోని ప్రతి ఒక్కరు ఆధార్ కలిగి ఉండాలని, పూర్తి సమాచారం నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో UIDAI జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఆధార్ నవీకరణ చేసుకోవాలని, 10 సంవత్సరాల క్రితం నుండి ఆధార్ అప్డేట్ చేసుకోని వారు నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు. అలాగే 5 నుండి 10 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలకు ఒక సారి తప్పనిగా బయోమెట్రిక్ నవీకరణ చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. UIDAI రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ మొహమ్మద్ సౌభన్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో ఆధార్ కేంద్రలను ఏర్పాటు చేయాలనీ, ప్రజల సౌకర్యార్థం ఆధార్ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పని సరిగా ఉన్నందున ప్రతి ఒక్కరు తమ వివరాలను ఆధార్ కార్డులో నవీకరణ చేసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు నిర్వహించే సమావేశాల్లో ఆధార్ నవీకరణపై వివరించాలని సూచించారు. ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం ఆధార్ నవీకరణకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.సాధన, LDM, ఈ-జిల్లా మేనేజర్ బి.రవి, తపాలా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.