DPROADB- ప్రజలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

ప్రజలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తు దారుల నుండి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అంగవైకల్యం కలిగిన వారికీ సదరం సర్టిఫికెట్ లు, పెన్షన్ లు, కుటుంబ భూ సమస్యలు, దళిత బస్తి, యాదవులకు గొర్రెల పంపిణి, ఉపాధి అవకాశాలు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన అర్జీలను ఆయా శాఖాధికారులు ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం, అర్హతల మేరకు అర్జీదారునికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రతిపాదించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీదారునికి తన దరఖాస్తుకు సంబందించిన సమాచారాన్ని వ్రాత పూర్వకంగా స్పష్టమైన వివరణతో సమాచారాన్ని అందజేయాలని అన్నారు. ఒకే సమస్యపై అనేకమార్లు దరఖాస్తు దారుడు ప్రజావాణికి రాకుండా చూడాలని తెలిపారు. ప్రజావాణిలో జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ అన్నారు.

ప్రతి నెల మూడవ తేదీన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఒక వేల ఆ తేదీన సెలవుదినం ఉంటె మరుసటి రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అధికారులు సమన్వయ సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలనీ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఉద్యోగులుగా విధినిర్వహణలో సకాలంలో సమిష్టి బాధ్యతతో నిర్వహించాలని అన్నారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే విధంగా అధికార యంత్రాంగం ఒక టీమ్ వర్క్ గా పనిచేసి జిల్లాను అన్ని రంగాలలో ముందు వరుసలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. గ్రీవెన్స్ లో వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గించాలని, దరఖాస్తు దారులు ఒకే సమస్యపై పలుమార్లు ప్రజావాణికి రాకుండా ఒకేసారి పూర్తీ సమాచారంతో దరఖాస్తు దారుని సమస్య ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు సంపూర్ణ సమాచారంతో దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. దరఖాస్తు దారుని సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనే సమాచారాన్ని వ్రాత పూర్వకంగా అందించాల్సిన బాధ్యత ఆయా శాఖాధికారులపై ఉందని అన్నారు. సంక్షేమ శాఖల సహకారంతో ఉపాధి కల్పన అవకాశాలను సాధ్యమైనంత వరకు కల్పించాలని అన్నారు. ప్రతి మాసం మూడవ తేదీన నిర్వహించే సమావేశంలో వివిధ శాఖలు ప్రతి మాసం నిర్వహించే సమావేశాలను ఆదే రోజున నిర్వహించాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు అనుమతి లేకుండా హెడ్ క్వార్ట్రర్ వదిలి వెళ్లకూడదని అన్నారు. బుధవారం రోజున జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు, అట్టి సమావేశంలో గత రెండు సంవత్సరాలలో చేపట్టిన ప్రగతి నివేదికలను సమర్పించాలని అన్నారు. అదేవిధంగా గురువారం రోజున ఐటిడిఏ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై ఉట్నూర్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post