DPROADB-రాయి సెంటర్ల సేవలు ఆదర్శనీయం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ 36వ వార్షికోత్సవ సభలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పిఓ కె. వరుణ్ రెడ్డి.

ఆదివాసీ గూడాల్లో సమస్యల సాధనకు ఏర్పాటు చేసిన రాయి సెంటర్లు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఉట్నూర్ లోని కుమురం భీం ప్రాంగణంలో గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి హాజరయ్యారు. అధికారులకు ఆదివాసీలు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ముందుగా కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి రాయి సెంటర్ ల ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 120 రాయి సెంటర్లు పని చేస్తున్నాయన్నారు. ఆదివాసీల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. విద్యా, నైపుణ్యం, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, రవాణా తదితర సౌకర్యాల కల్పనతో ఆదివాసీల్లో మార్పు సాధ్యం అవుతుందన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను రాష్ట్రపతి పర్యటన సందర్బంగా వివరించడం జరిగిందని అన్నారు. కోవిడ్ అనంతరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. రాయి సెంటర్ ల సహకారంతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. గిరిజన పండుగలు, జాతరల సందర్బంగా గిరిజన విద్యార్థులు విద్యలో వెనుకబడకుండా సర్ మేడి లు వారి పరిధిలోని గ్రామాలలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. తప్పని సరిగా ప్రతి ఒక్క విద్యార్ధి బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలల్లో మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మరమ్మత్తులు, మౌళిక సదుపాయాలు కల్పించబడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఇదే తరహాలో గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలోని పాఠశాలల్లో బయిమెట్రిక్ విధానాన్ని అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సుఖ ప్రసవాలు జరిగేలా వైద్యసేవలు అందిస్తున్నామని, రక్త హీనత కలిగిన గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, ఇటీవల కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, ఉద్యాన పంటల సాగుకు గిరిజన రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పెంపొందిస్తున్నామని అన్నారు. యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణలు అందిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలలో పటేల్ లు, సర్ మేడి ల సహకారం తో అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని అన్నారు. 200 గిరిజన గ్రామపంచాయితీలను ఆదర్శ పంచాయితీలు గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహస్తున్న స్టార్స్ 50 శిక్షణ కేంద్రంలో విద్యార్థులు ఐఐటి, నీట్ వంటి అత్యుత్తమ విద్యా సంస్థలలో ప్రవేశాలు పొందారని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా మరింత కృషి చేయాలనీ అన్నారు. స్వచ్చంద సంస్థల సహకారంతో ఉపాధి నైపుణ్య శిక్షణలు, ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫుడ్, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పట్టు పరిశ్రమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. 300 మంది గిరిజన రైతులకు గిరివికాసం కార్యక్రమం క్రింద బోరు బావులు, విద్యుత్ మోటార్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన గిరిజన గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరుగుతున్నదని తెలిపారు. గోండు బాషాన పరిరక్షించేందుకు వివిధ రచనలను గోండు భాషలను అనువాదం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జంగ్ బాయి జాతర కు సంబంధించిన గోడ ప్రతులను, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల 36 వ వర్ధంతి సభ కరపత్రాలను కలెక్టర్, పిఓ లు ఆవిష్కరించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆదిమ గిరిజన సలహా మండలి చైర్మన్ కనక లక్కేరావు, APO PVTG ఆత్రం భాస్కర్, రాయి సెంటర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు మెస్రం దుర్గు పటేల్, ఉమ్మడి జిల్లా సార్మాడీలు, ఆదివాసీల పెద్దలు, గిరిజనులు, విద్యార్థులు, అధికారులు, తదితరులున్నారు.

Share This Post