DPROADB-రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు పకడ్బందీగా నిర్వహించాం- ఆర్డీఓ రమేష్ రాథోడ్.

ఆదిలాబాద్ డివిజన్ లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నేడు పకడ్బందీగా నిర్వహించామని ఆర్డీఓ రమేష్ రాథోడ్ తెలిపారు. డివిజన్ పరిధిలో 27 చౌక ధరల దుకాణాల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఒక దుకాణానికి దరఖాస్తులు రాలేదని, మిగతా వాటికి వ్రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా 1:5 అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలువడం జరిగిందని తెలిపారు. 117 మంది అభ్యర్థులకు గాను, హాజరైన 114 మందికి ఇంటర్వ్యూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించామని ఆర్డీఓ తెలిపారు.

Share This Post