DPROADB- విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఆదిలాబాదు పట్టణంలోని హమీద్ పురా, విద్యానగర్, ఖానాపూర్ పాఠశాలల్లో మన ఊరు- మన బడి, మన బస్తి- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టి పూర్తైన పనుల పాఠశాలలను అదనపు కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతలో 237 పాఠశాలల్లో మరమ్మత్తులు, త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, తదితర పనులకు శ్రీకారం చుట్టి నిర్వహించబడుచున్నావని తెలిపారు. హమీద్ పురా ఉర్దూ మీడియం పాఠశాలను 20.27 లక్షలు, విద్యానగర్ లో 20.63 లక్షలు, ఖానాపూర్ (ఉర్దూ మీడియం) లో 17.39 లక్షలతో సివిల్ వర్క్ పనులు పూర్తిచేసుకొని, రంగులు, డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డులు లను సమకూర్చుకోవడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో చేపట్టిన పనులను పూర్తిచేసుకొని దశల వారిగా ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం సంకల్పించిన ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను పొందాలని ఆకాంక్షించారు. పాఠశాలల మేనేజ్మెంట్ లు నిర్వహణ తప్పని సరిగా చేపట్టాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన పాఠశాల భవనాలను మరమ్మత్తులు, ఇతర సౌకర్యాలు కల్పించి ఒకేసారి పనులు పూర్తిచేసుకొని పాఠశాలలను వినియోగం లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలని అన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ, విద్యా ప్రమాణాల మెరుగుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నదని, గురుకులాలు నిర్మించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బదిలీ జిల్లా ప్రజలకు బాధ కలిగినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత ఉంటుందని, జిల్లా ప్రజలు కలెక్టర్ సేవలను గుర్తుంచుకుంటారని, మున్ముందు మంచి ఉన్నత స్థానాలను అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో ట్రైనీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమీషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, సెక్టోరల్ అధికారులు నారాయణ, నర్సయ్య, ఉదయ శ్రీ, స్థానిక వార్డుల కౌన్సిలర్లు ప్రకాష్, కలాల శ్రీనివాస్, విజయ్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post