Dr.Banda Prakash,MP requested for new ESI hospitals and dispensaries.

పత్రికా  ప్రకటన 

న్యూ ఢిల్లీ 

తేదీ : 30-06-2021

గౌరవ పార్లమెంట్ సభ్యులు డా . బండ ప్రకాష్ ఢిల్లీ లో ని కేంద్ర కార్మిక , ఉపాధి శాఖ సహాయ మంత్రి  శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ గారి పి ఎస్ ని కలసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇ ఎస్ ఐ ఆసుపత్రులు , డిస్పెన్సరీలు , మరియు పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలనీ కోరుతూ లేఖ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మల్లా రెడ్డి గారి లేఖ తో పాటు పెండింగ్ లో ఉన్న అంశాల పై పార్లమెంట్ సభ్యులు డా . బండ ప్రకాష్ వివరాలతో కూడిన లేఖ అందించారు. రాష్ట్రం లో ని నాచారం ఇ ఎస్ ఐ ఆసుపత్రి లో కరోనా బాధితులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన భీమా చేసిన వ్యక్తులు  దాదాపు 18 లక్షలు మరియు 70 నుండి 80 లక్షల కుటుంబసభ్యుల కు వైద్య సేవలు అందించేందుకు కొత్త ఇ ఎస్ ఐ ఆసుపత్రులు , డిస్పెన్సరీలు ఎంతగానో అవసరం అని  కోరారు. 62 డిస్పెన్సరీల నవీనీకరణ ప్రతిపాదనలు ఈపాటికే కేంద్రానికి అందించడం జరిగిందన్నారు. భోనగిరి, మహేశ్వరం , మహబూబ్ నగర్, మేడ్చల్ లో ఇ ఎస్ ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగింది. షాద్ నగర్, మహేశ్వరం , రంగారెడ్డి లో ని ఇబ్రహీంపట్నం , గుండ్ల పోచంపల్లి, సంగారెడ్డి , కొత్తగూడం లో ని పాల్వంచ, సూర్యాపేట  హుజుర్ నగర్ , వికారాబాద్ , సిరిసిల్ల లో ఇ ఎస్ ఐ డిస్పెన్సరీలు స్థాపించాలని కోరారు. 2019-20 పెండింగ్ లో  ఉన్న 104. కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలనీ కోరారు.

రాష్ట్ర సమాచార కేంద్రం, న్యూ ఢిల్లీ ద్వారా జారీ చేయబడినది

Share This Post