Dt.25-8-2021. బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

Press Note Dt.25-8-2021.

బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు ఆయన DPM,APM, వ్యవసాయ శాఖ AD, AO, AEO, స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను మండలాల వారిగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాన్సువాడ, పెదకొదపుగల్ మండలాలు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, మెప్మా రుణాలలో మంచి ప్రగతి సాధించినందుకు అధికారులను అభినందించారు. నస్రుల్లాబాద్, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, కామారెడ్డి మండలాలు లక్ష్యాలలో వెనుకబడి ఉన్నాయని అంటూ 55 శాతం ఖచితంగా సాధించాలని, 55 శాతం సాధించిన వారు ఈనెల 31లోగా 60 శాతం సాధించాలని ఆదేశించారు.
మెప్మా రుణాలలో 60 శాతం సాధించామని, ఈ నెల చివరి లోగా 65 సాధించాలని తెలిపారు.
స్త్రీ నిధి రుణాల గురించి మాట్లాడుతూ మదునూర్ మండలం 18 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించిందని, అసిస్టెంట్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దోమకొండ మండలం కూడా 22 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించిందని తెలియచేస్తూ ఈ నెలాఖరు వరకు 40 శాతం సాధించాలని, 30 శాతం సాధించిన మండలాలు ఈ నెలాఖరు వరకు 50 శాతం సాధించాలని ఆదేశించారు.
స్త్రీ నిధి రుణాల కింద లబ్దిదారులకు గేదెలు అందించడంలో ఒక యూనిట్ కింద 93,270 రుపాయలతో ఒక గేదె అందించడం జరుగుతున్నదని, జిల్లాకు 2500 యూనిట్ల లక్ష్యానికి గాను 1700 యూనిట్ లకు లబ్దిదారులను గుర్తించడం జరిగిందని, ఈ నెల 31 లోగా మిగిలిన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు.
మహిళా సమాఖ్యలు తమకు ఆదాయాన్ని అందించే చిన్న కుటీర పరిశ్రమలపై అవగాహన పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పిండి మిల్లు, ఆయిల్ మిల్లు, కిరాణా దుకాణాలు, పప్పు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులను గుర్తించాలని, వారికి అందించే పరిశ్రమలకు గ్రామాలలో క్వాలిటీ ఆహార వస్తువుల మార్కెట్ పరిస్థితులను పరిశీలించాలని, ప్రభుత్వ గురుకుల స్కూల్స్, వసతి గృహాలకు అవసరమైన వాటిని పంపిణీ చేసేలా పరిస్థితులను అధ్యయనం చేయాలని, మండల సమాఖ్య, గ్రామా సంఘాలను అవగాహన పరచాలని సూచించారు.
పంట రుణాలకు సంబంధించి ఈ నెల చివరిలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. బిర్కూర్ 70 శాతం సాధించిందని అభినందించారు. బాన్సువాడ 55 శాతం మాత్రమే సాధించిందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేసి సాధించాలని ఆదేశించారు.
రైతు బీమాలో మిగిలిన అకౌంట్స్ ఈ రోజులోగా పూర్తి చేయాలని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, ఇప్పటి వరకు ఎరువుల పంపిణి బాగుందని, ఇప్పటి వరకు 46,978 మెట్రిక్ టన్నులు సప్లై చేసామని, 5242 మెట్రిక్ టన్నుల ఎరువు అందుబాటులో ఉందని, కృత్రిమ కొరత లేకుండా చూడాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ డి. మాధవ రావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా లీడ్ అధికారి రాజేందర్ రెడ్డి, మెప్మ శ్రీధర్ రెడ్డి, స్త్రీ నిధి ఎ జి ఏం రవికుమార్, డి పిఏం రమేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
……DPRO., KAMAREDDY.

Share This Post