Dt.25-8-2021. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండడంతో రవాణాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు చెందిన బస్సులను తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ అధికారి శ్రీమతి వాణి నేడొక ప్రకటనలో తెలిపారు.

Press Note Dt.25-8-2021.

సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండడంతో రవాణాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు చెందిన బస్సులను తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ అధికారి శ్రీమతి వాణి నేడొక ప్రకటనలో తెలిపారు.

దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని విద్యా సంస్థలకు చెందిన ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని, నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను అక్కడికక్కడే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
దానికోసం ఈ నిబంధనలు తప్పనిసరి పాటించాలని ఆమె తెలిపారు.
 మోటారు వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ , ఫిట్ నెస్ సర్టిఫికెట్, పర్మిట్, పన్ను చెల్లింపు రసీదు, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్ తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
 డ్రైవర్లకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల వయసు మించకుండా చూసుకోవాలి. తప్పకుండా కంటి పరీక్షలు జరిపించాలి
 ప్రతి బస్సు డ్రైవర్, అటెండర్ డీటెయిల్స్ ఆన్ లైన్ లో నమోదు చేయాలి.
 డ్రైవర్ ఫోటోను తప్పనిసరిగా బస్సులో ఏర్పాటు చేయాలి. అద్దాలకు గ్రిడ్ అమర్చాలి. చిన్నారులు ఎక్కేందుకు మెట్లు కింద వరకు ఏర్పాటు చేయాలి
 బస్సు డ్రైవర్ కు స్కూల్ యాజమాన్యం హెల్త్ కార్డు ఇప్పించి, ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించాలి
 డ్రైవర్ లైసెన్స్ ను స్కూల్ యాజమాన్యం తప్పక తనిఖీ చేయాలి
 డ్రైవర్ వివరాలను పేరెంట్స్ కమిటీకి అప్పగించాలి
 సురక్షిత ప్రయాణం కోసం అటు డ్రైవర్ కి , ఇటు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి
 ప్రతి బస్సులో విద్యార్థులకు అటెండెన్స్ తీసుకోవాలి
 ప్రతి 10 బస్సులకు ఒక అదనపు బస్సు ఏర్పాటు చేసుకోవాలి
 ప్రతి బస్సుకు ఎడమవైపు వెనుక స్కూల్ పేరు చిరునామా మరియు ఫోన్ నెంబరు రాయాలి
 ప్రతినెల స్కూల్ ప్రిన్సిపాల్, పేరెంట్స్ కమిటీ తప్పనిసరిగా బస్సులను తనిఖీ చేయాలి
 బస్సు నిర్వహణపై రిజిస్టర్ ఏర్పాటు చేయాలి
 డ్రైవర్ వద్ద ఫిర్యాదు పుస్తకం ఉండేలా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ , సైడ్ అద్దాలు ఉండేలా చూసుకోవాలి.
 పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించ రాదు. బస్సుకు సంబంధించి బ్యాటరీ వైపర్స్ , రెండువైపులా ఇండికేటర్లు పని చేసేలా చూసుకోవాలి
 బస్సులకు తప్పక పసుపు రంగు వేయాలి
 కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి.

విద్యా సంస్థలకు చెందిన బస్సులను నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి. ఆర్ సి ఫిట్ నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని బస్సుల్లో విద్యార్థులను ఎక్కించడానికి వీలు లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి బస్సులో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. బస్సులో ప్రతి విద్యార్థి మాస్కు ధరించేలా సూచించాలి. ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి.

…DPRO., KAMAREDDY.

Share This Post