Dt.28.8.2021. గత ఖరీఫ్ సీజన్ సిఎంఆర్ రైస్ మిల్లింగ్ వచ్చే సెప్టెంబర్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పౌరసరఫరాల అధికారులను, రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు.

Press Release. Dt.28.8.2021.

గత ఖరీఫ్ సీజన్ సిఎంఆర్ రైస్ మిల్లింగ్ వచ్చే సెప్టెంబర్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పౌరసరఫరాల అధికారులను, రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు.

శనివారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో పౌరసరఫరాల అధికారులు‌, రైస్ మిల్లర్స్ తో సీఎంఆర్ మిల్లింగ్ పనులను మిల్లుల వారీగా ఆయన సమీక్షించారు.
గత ఖరీఫ్ కు సంబంధించిన మిల్లింగ్ పనులు వచ్చే 10వ తేదీ లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సీఎంఆర్ మిల్లింగ్ లో జాయింట్ కస్టోడియన్లుగా వున్న పౌర సరఫరాల డిప్యూటీ తాసిల్దారు ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అనుకున్న సమయంలోగా మిల్లింగ్ పూర్తిచేయాలని, 24 గంటలు పర్యవేక్షణలో చేపట్టాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు రైస్ మిల్లర్ల తో సమావేశం ఏర్పాటు చేసుకుని వచ్చే నెల 10 లోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని, ప్రతిరోజు మిల్లింగ్ నివేదికలను సమర్పించాలని సూచించారు. రబీ సీజన్ సిఎంఆర్ మిల్లింగ్ పనులకు తహశీల్దార్లను, విఆర్ఓ లను నియమించాలని ఆర్డీవోలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, ఆర్డీవోలు శ్రీను, రాజా గౌడ్, FCI డివిజనల్ మేనేజర్ సయ్యద్ రిజ్వాన్, జిల్లా పౌరసరఫరాల డీఎం జితేందర్ ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు గౌరీశంకర్, రైస్ మిల్లు యజమానులు, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.

…….DPRO. KMR

Share This Post