Dt;31-07-2021 గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 31.07.2021

గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ఆయన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు గేదెలు, గొర్రెలు, బోరు మోటార్లు, కిరణ్ దుకాణాల ఏర్పాటు యూనిట్లు మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బాలయ్య, గాంధారి ఎంపీపీ రాధ, జడ్పిటిసి సభ్యులు శంకర్ నాయక్ పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post