ప్రెస్ రిలీజ్.
తేది.25.8.2021.
హనుమకొండ.
బుధవారం నాడు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి తో కలసి కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలోని బస్టాండ్ దగ్గర గల కమర్షియల్ కాంప్లెక్స్ బహిరంగ వేలం నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ జి ప్లస్ త్రి 50 వేల స్వ్కేర్ ఫీట్ల విస్తీర్ణం కలదని పేర్కొన్నారు. ఈ భవనం బహిరంగ వేలంలో జి. వీరస్వామి, ఏ. రవీందర్, వి. శ్రీనివాస్ లు అనే వ్యక్తులు ఒకొక్కరు 5లక్షల రూపయల ఈఎండిలను చెల్లించి ఈ వేలంలోపాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంలో పాల్గొన్న వి. శ్రీనివాస్ కు లీజు కు ఇవ్వడం జరిగింది. ఈ కాంప్లెక్స్ లీజుకు గత నాలుగు సంవత్సరాల నుండి ఎవ్వరూ ఆసక్తి చూపలేదని ,ఇప్పుడు వి.శ్రీనివాస్ ఈ వేలంలో పాల్గొని కాంప్లెక్స్ ను లీజు పొందారని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కుడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, సెక్రటరీ మురళీధర్ రావు, ఈ ఈ భీం రావు, ఏ ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.2582021pressnotephotos