HANAMKONDA జిల్లా లోనిపెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ.
తేదిః 17-08-2021.

జిల్లా లోనిపెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎంపీడీవో లను ఆదేశించారు.
మంగళవారం నాడు ఆయన కలక్టరేట్ మీటింగ్ హాలులో
మండలం లోని వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జిల్లాలోని వివిధ మండలాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల నిర్వహణను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.
ప్రత్యేక అధికారులు పనుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలని అన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనాల కొరకు స్థలాలను గుర్తించి మొక్కలు నాటే పనులు చేపట్టాలని, అనువైన స్థలం లభించనట్లయితే ఒకే చోట కాకుండా సమీపంలో స్థలాలను గుర్తించాలని పేర్కోన్నారు. అటవి ప్రాంతాలలో నాటే మొక్కలలో పూలమొక్కలను నాటకూడదని, లక్ష్యాల మేర నాటడానికి మొక్కలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తపడాలని పేర్కోన్నారు. .
మల్టీ లేయర్ ఎవన్యూ ప్లాంటేషన్ ను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. వైకుంఠ ధామాలు,సెగ్రీగేషన్ షెడ్ల నిర్మాణం ను వేగవంతం చేయాలని కోరారు.క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారులదృష్టికి తీసుకుని రావాలని ఆయన అన్నారు. హనుమకొండ జిల్లా లో కొత్తగా కలిపిన మండలాల్లో అధికారులు ఆయా మండల అభివృద్ధి కి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యకమంలో అధనపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, వరంగల్ అర్బన్ జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర రావు, డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీశ్వర్, డయల్ పిఓ కల్పన, పంచాయతీ రాజ్ డీఈఈ లు, ఏ ఈఈ లు, 12 మండలాల ఎంపిడిఓ లు, ఎంపీవోలు, ఏపీవోలు, తదితరులు పాల్గోన్నారు.

Share This Post