HANAMKONDA ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

ప్రెస్ రిలీజ్.
వరంగల్

అర్బన్.
తేదీ: 23.8.2021.
ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రజా విజ్ఞప్తులు, ఫైళ్ల నిర్వహణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వివిధ సమస్యలపై విజ్ఞప్తులు సమర్పిస్తున్నట్లు, అట్టి సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఈ రోజు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 98 విజ్ఞప్తులు వచ్చయన్నారు. ప్రజా విజ్ఞప్తులపై సమీక్ష చేసి, పరిష్కారానికి చర్యలు వేగం చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందకి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు తమ లక్ష్యాలపై వ్యక్తిగత శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని అన్నారు.
1. రెవిన్యూ శాఖ – 47
2. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్- 21
3.మహిళ, శిశు సంక్షేమ శాఖ – 05
4. పంచాయితీ రాజ్ శాఖా – 03
5. వైద్య శాఖ- 08
6. ఇతర శాఖల కు సంబంధించినవి – 14
మొత్తం 98
అంతకముందు బాలసదనం కు చెందిన చిన్నారులు కలక్టర్ కి రాఖీలు కట్టారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంద్యారాణి, అదనపు డి.సి.పి. భీం రావు, ఏ.సి.పి. వేముల శ్రీనివాస్, డి.ఆర్.డి.ఓ., శ్రీనివాస్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి, వాసుచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. లలిత దేవి, పిడి డ్వామా భద్రు, డి.డబ్లు.ఓ. సభిత, డి.ఈ.ఓ., నారాయణ రెడ్డి, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి అశోక్ కుమార్, బిసి వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, ఉప సంచాలకులు, షెడ్యుల కులముల సక్షేమం నిర్మల, జిల్లా మైనారిటీ సక్షేమ అధికారి శ్రీను, జిల్లా పౌర సరఫర ఆధికారిణి వసంతలక్ష్మి, డి.ఎం. సివిల్ సప్లై కృష్ణవేణి, ఎ.డి. అగ్రికల్చర్ దామోదర్ రెడ్డి, సి.పిఒ సత్యనారాయణ రెడ్డి, ఎల్దిఎమ్ మురళిమోహన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post