HANAMKONDA DATE 14-8-2021ఇంటింటా ఇన్నోవేటర్ లో సత్తా చాటిన జిల్లా వాసులు : పాలనాధికారి శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు

HANAMKONDA 14-8-2021

ఇంటింటా ఇన్నోవేటర్ లో సత్తా చాటిన జిల్లా వాసులు : పాలనాధికారి శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు

తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనలో జిల్లా వాసులు మరో మారు సత్తా చాటినట్టు జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.గత మూడేళ్లుగా టి.ఎస్.ఐ.సి నిర్వహిస్తున్న వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనలో ఈ మారు జిల్లాకు చెందిన 3గురు తమ ప్రతిభ కనబర్చి బహుమతులు గెలుచుకున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని నందనం గ్రామానికి చెందిన యాకర గణేష్ రూపొందించిన – సంస్కార టాయ్, స్ప్రింగ్ లోడ్ చేయబడిన భ్రమణ శక్తి యంత్రం రూపొందించిన గుండేటి మధు, వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ రూపొందించిన దోస దిలీప్ లు బహుమతులు గెలుపొందారు. ఈ ఆవిష్కరణలను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రదర్శనకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంద్భంగా జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణ రెడ్డి, ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా సమన్వయకర్త & డి.ఎస్.ఓ పి. సురేష్ బాబు లు ఆవిష్కరణలను అభినందించారు.

Share This Post