HANUMAKONDA దళిత బంధు లబ్ధిదారులు అధిక ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు.

ప్రెస్ రిలీజ్.
హనుమకొండ.
తేది :18 -08 -2021 :

దళిత బంధు లబ్ధిదారులు అధిక ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు.

దళిత బంధు లబ్ధిదారులు అధిక ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు లబ్ధిదారులకు సూచించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలొ దళిత బంధు పథకం ప్రారంభ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం పొందిన హుజరాబాద్ నియోజకవర్గం కమలపూర్ మండలం లోని 03 మంది లబ్ధిదారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు క్రింద యూనిట్ స్థాపించుకొనుటకు కుటుంబ సభ్యులతో చర్చించి ఆలోచించుకొని మంచి ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. దళితబంధు పథకం క్రింద యూనిట్ల ఎంపికకు ఎలాంటి తొందర అవసరం లేదని, వారం రోజుల సమయం లో గ్రామస్తులచే చేర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు బ్యాంకులలో జీరో అక్కౌంట్ ఉన్న కొత్తగా దళిత బంధు అక్కౌంట్ ను ఓపెన్ చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులు యూనిట్ల ఎంపికకు జిల్లా అధికారులతో పూర్తి అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించుటకు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సమకూర్చే మంచి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులు కన్నూర్ గ్రామానికి చెందిన కనకం రవీందర్, శనిగరం గ్రామానికి చెందిన నాంపల్లి రాజేందర్, కమలపూర్ కు చెందిన మట్ట శుభాష్ లను వారి కుటుంబ సభ్యులను
డైయిరీ నిర్వాహణ పై అవగాహన పెంపొందించుటకు కరీంనగర్ డైయిరీ కి లబ్ధిదారులను తీసుకువెళ్లి పాడి గేదెల రకాలు డైయిరీ నిర్వాహణ, దాన, పాలు తీయడం, ఎలా మార్కెటింగ్ చేయాలనే విషయాల పై అదేవిధంగా నాటు కోళ్ళు ఫారాలను చూపించి పూర్తి అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి వెంటనే లర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడి అగ్రికల్చర్ ఉషాదయల్, జిల్లా పరిశ్రమల కెంద్రం జనరల్ మేనేజర్ ఎం. హరిప్రసాద్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ పురుషోత్తం, కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షె.కు.ల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ యస్. మాధవిలత, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. కె.వి. నారాయణ, కె. దామోదర్ రెడ్డి,
సహాయ సంచాలకులు (వ్యవసాయ), కమలపూర్ ఎంపిడివో పళ్లవి, కమలపూర్ డిప్యూటీ తహసీల్దార్ శైలజ, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు

.

Share This Post