Hon’ble Minister for Agriculture

Press Release
Please Cover

For Print & Electronic Media
తేది.07/06/2021, హైదరాబాద్

*తెలంగాణ జిన్నర్స్ అసోసియేషన్  ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు*

పత్తి సాగుకు ప్రోత్సాహం

– ఈ వానాకాలం 75 లక్షల ఎకరాలలో పత్తి సాగు లక్ష్యం

– తెలంగాణ పత్తి నాణ్యతలో జాతీయంగా, అంతర్జాతీయంగా నంబర్ వన్ .. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇప్పటికే పలుమార్లు దృవీకరించారు

– విస్తీర్ణంలో మహారాష్ట్ర ఎక్కువ ఉన్నా సగటు ఉత్పత్తిలో తెలంగాణదే మొదటిస్థానం

– పత్తి సాగు విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదలగా ఉన్నారు

– పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులకు రాయితీలతో ప్రోత్సాహం.. ఇప్పటికే కరంటు సబ్సిడీ ఇవ్వడం జరిగింది .. మరిన్ని పారిశ్రామిక రాయితీలు ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి వర్తింపజేస్తాం

– తెలంగాణ ఏర్పాటయ్యే వరకు వంద లోపే జిన్నింగ్ మిల్లులు, తెలంగాణ ఏర్పాటైన తరువాత 350 నూతన జిన్నింగ్ మిల్లుల ఏర్పాటు .. నిర్మాణంలో మరో 30 మిల్లులు .. ప్రతి ఏటా ఈ మిల్లుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది

– గతంలో ఆంధ్ర, మహారాష్ట్రలకు జిన్నింగ్ కోసం వెళ్లాల్సి ఉండేది

– ఒక్కో మిల్లు ద్వారా ప్రత్యక్ష్యంగా వంద మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి .. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు మూలంగా స్థానికంగా ఉపాధి .. గ్రామీణ ఉపాధి పెంచడంలో ఈ మిల్లుల పాత్ర ఉంది

– పత్తి విత్తనాల నుండి వచ్చే నూనె, కేక్, సాల్వెంట్ వంటి ఉప ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్

– జిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహం కొరకు ప్రభుత్వ పరిశీలనలో కాటన్ సాల్వెంట్ పాలసీ

– వానాకాలం మాత్రమే కాకుండా యాసంగి ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలబడే పత్తి వంగడాలను తీసుకురావాలని గతంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరడం జరిగింది .. ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి

– ఇవి సఫలం అయితే వానాకాలం, యాసంగిలో పత్తి సాగుకు అవకాశం ఉంటుంది .. ఇది తెలంగాణ రైతాంగానికి గొప్ప వరం అవుతుంది

– అప్పుడు వరి పంట మాదిరిగానే రెండు పంటలూ పత్తి సాగవుతుంది .. వరి సాగుకు ప్రత్యామ్నాయం కూడా అవుతుంది

– వానాకాలంలో రైతులు వరి సాగు తగ్గించి పత్తి సాగు పెంచాలి .. సకాలంలో వానలు రాకున్నా పత్తికి నీటి తడులు వేసుకుంటే దిగుబడి కూడా పెరుగుతుంది .. ఇప్పుడు తెలంగాణలో నీటికి కొదవలేదు

– పత్తిలో కూలీల కొరతను తట్టుకునేందుకు యాంత్రీకరణకు పెద్దపీట.. ఏకకాలంలో పత్తి దిగుబడి వచ్చే వంగడాల కోసం పరిశోధనలు సాగుతున్నాయి

– పత్తికి గతంలో గులాబీరంగు పురుగు బెడద ఉండేది .. శాస్త్రవేత్తల కృషితో ఇప్పుడు పురుగుమందులు రావడంతో ఆ ఇబ్బంది లేకుండా పోయింది

– తెలంగాణ రాష్ట్రం పత్తి సాగులో అగ్రగామి అని రుజువుచేద్దాం

– తెలంగాణ రైతన్నలు పెద్దఎత్తున పత్తి సాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం

– ప్రభుత్వ విజ్ఞప్తిని రైతులు పరిగణనలోకి తీసుకోవాలి

– జిన్నర్స్ అసోసియేషన్ సూచనలను, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం

– తెలంగాణ జిన్నర్స్ అసోసియేషన్  ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Share This Post