ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా
తేది.22/06/2021, హైదరాబాద్
59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ.
– మంగళవారం 2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02 లక్షల ఎకరాలకు గాను రూ.651.07 కోట్లు జమ.
– మొత్తం ఇప్పటి వరకు 133.27 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం.
– వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 95.4 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 40 శాతం ఎక్కువగా 137.6 ఎంఎం వర్షపాతం నమోదయింది.
– రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో విత్తనాలు .. దాదాపు 13 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు అవసరం ఉండగా ప్రణాళిక ప్రకారం అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
– సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.61.52 కోట్ల విలువగల పచ్చిరొట్ట విత్తనాలయిన జీలుగ, పిల్లిపెసర, జనము విత్తనాలు 65 శాతం సబ్సిడీపై అందించడం జరిగింది.
– దాదాపు 14 లక్షల ఎకరాలకు ఈ విత్తనాలు సరిపోతాయి .. నేల సారం పెంచేందుకు దోహదపడతాయి.
– 4.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు మొత్తం 8.64 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు ఈ రోజు వరకు అందుబాటులో ఉంచడం జరిగింది.
– రాష్ట్రంలో ఈ రోజు వరకు 18.88 లక్షల ఎకరాలలో సాగు మొదలయింది .. ప్రధానపంట అయిన పత్తి 14.82 లక్షల ఎకరాలలో, కంది 1.58 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది.
– ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులు రైతాంగానికి కలగకుండా వ్యవసాయ శాఖ అన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది.
– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.