PRESS Release
Please Cover
For Print & Electronic Media
తేది.11/05/2021,
హైదరాబాద్.
*రెడ్ హిల్స్ లో అగ్రోస్ నూతన కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన అగ్రోస్ ఎండీ రాములు గారు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు తదితరులు*
అగ్రోస్ టర్నోవర్ రూ.123 కోట్లు.
– తెలంగాణ ఆగ్రోస్ 2019-2020 సంవత్సరం లో రూ.123 కోట్ల పైచిలుకు టర్నోవర్ సాధించి ఎన్నో వినూత్న పథకాలతో ముందంజ వేస్తుంది.
– తెలంగాణ రైతాంగానికి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు ఒకే గొడుగు క్రింద అందుబాటులో ఉంచడానికి, నిరుద్యోగ వ్యవసాయ మరియు సైన్స్ చదివిన గ్రాడ్యుయేట్స్ కి ఉపాధి కల్పించే దిశగా 1000 “ఆగ్రో రైతు సేవా కేంద్రాలు” తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రతి మండలంలో ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాల వలన రైతు ముంగిటకు సరఫరా చేయడం జరుగుతుంది.
– భూసార పరీక్షా కేంద్రాలను సమర్ధవంతంగా నడపడానికి ARSK లు నడుపుతున్న ఔత్సాహిక వ్యవసాయ పట్టభద్రులకు మరియు ఇతర సైన్స్ గ్రాడ్యుయేట్స్ కు అవకాశం కల్పించడం జరుగుతుంది.
– నాబార్డు, మేనేజ్ మరియు SLBC వంటి సంస్థల సహకారంతో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల కార్యకలాపాలను మరింత పటిష్ట పరచడానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఆర్థిక సహాయం అందించుట గాను కోరటమైనది.
– కార్బైడ్ రహిత స్వచ్ఛమైన మామిడి, అరటి పండ్లను తెలంగాణ వినియోగదారులకు అందజేయడానికి ఎన్ రైప్ (సహజసిద్ధమైన ప్రోడక్ట్) ను అన్ని పండ్ల మార్కెట్ లలో అందజేస్తుంది.
“తెలంగాణ సిరి” సిటి కంపోస్టును ఆగ్రోస్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. భారత ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి ప్రతి ఆరు బ్యాగుల ఎరువులకు మూడు బ్యాగులు సిటి కంపోస్ట్ ను వాడి రైతులు తమ భూముల సారవంతం పెంచుకోవాలని, ఆగ్రోస్ అందించే సిటీ కంపోస్ట్ విరివిగా వాడాలని, రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మారాలని ప్రయత్నం చేస్తుంది.
– పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలించడానికి బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ బ్యాగులను (మట్టిలో కలిసిపోయే విధంగా) పంపిణీ చేయడానికి తెలంగాణ ఆగ్రో చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ఆగ్రోస్ కు తిరుమలలో లడ్డూ ప్రసాదానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ బ్యాగులను వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– వ్యవసాయ యాంత్రీకరణకు నాణ్యమైన వ్యవసాయ యంత్రాలు పనిముట్లు తెలంగాణ ఆగ్రో ద్వారా సబ్సిడీ మరియు నేరుగ రైతాంగానికి అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– ఆగ్రో కర్షక పెట్రోల్ బంకులు నెలకొల్పి నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను అందజేసి కొంత మంది యువతకు చేదోడును అందజేయడం జరుగుతుంది.
– తెలంగాణ ఆగ్రోస్ చేపడుతున్న, చేపట్టబోయే వినూత్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
– రెడ్ హిల్స్ లో అగ్రోస్ నూతనం కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు తదితరులు.