Press Release
Please Cover
For Print & Electronic Media
తేది.24/06/2021, హైదరాబాద్
*FEDERATION OF Telangana Chambers Of India ( FTCCI) నివేదికలోని సూచనలను అమలుకు తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, FTCCI పరిశోధనా బృందం డిప్యూటీ సీఈఓ సుజాత ఆధ్వర్యంలో రూపొందించిన పల్సెస్ (pulses Opportunities & Way Forward)పై రూపొందించిన నివేదికను సాయంత్రం హాకా భవన్ లో విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన అధ్యక్షులు రమాకాంత్ ఇనాని, సీఈఓ క్యాతి నరవనే తదితరులు*
పప్పు దినుసుల వినియోగం, ఉత్పత్తి, దిగుమతిలో అగ్రస్థానం మనదే
– దేశంలో అత్యధిక జనాభా పప్పుదినుసులు వినియోగిస్తున్నారు .. అందుకే ఎక్కువగా వినియోగిస్తున్నాం
– దేశంలో ఆహార భద్రత సాధించాం .. కానీ పోషక భద్రతను పూర్తిస్థాయిలో కల్పించలేకపోతున్నాం
– పప్పుదినుసుల ఉత్పత్తి విషయంలో ఆయా దేశాల్లో పండే విస్తీర్ణం, ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది .. మిగతా దేశాలు దానిని సాధించగలిగాయి
– మన దేశంలో పండే పంటల విస్తీర్ణంలో 34 శాతం పప్పు దినుసులు సాగుచేస్తున్నా కూడా ఉత్పాదకత సాధించలేకపోతున్నాం .. అందుకే మొత్తం జనాభాకు సరిపడే మోతాదులో పప్పుధాన్యాలు పండించలేక పోతున్నాం
– 2010 – 2017 మధ్యకాలంలో దేశంలో పప్పు దినుసుల దిగుబడి హెక్టారుకు 649 కిలోలు మాత్రమే ఉంది
– 2017 తర్వాత కేంద్రప్రభుత్వం మన సాగు గణనీయంగా పెంచాలని భావించినా దేశంలో వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర దేశాల దిగుమతుల మీదనే ఆధారపడాల్సి వస్తుంది
– దేశంలో ఇక్రిషాట్ చేసిన ఒక పరిశోధనలో మాంసపుకృత్తుల కోసం ఎక్కువమంది ప్రజలు పప్పుదినుసుల మీదనే ఆధారపడుతున్నారని తేలింది
– దేశంలో గానీ, తెలంగాణలో గానీ పప్పుదినుసుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది
– దానిని గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత కొన్నేళ్లుగా పంటమార్పిడిలో భాగంగా పప్పుదినుసుల సాగును ప్రోత్సహిస్తున్నారు
– దానిలో ప్రధానంగా కంది పంటను గతంలో 6 లక్షల ఎకరాల నుండి గత ఏడాది 10.80 లక్షల ఎకరాలకు, ఈ ఏడాది 20 లక్షల ఎకరాలలో సాగును ప్రోత్సహిస్తున్నారు
– దాంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో దాల్ మిల్లుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తాం
– FEDERATION OF Telangana Chambers Of India ( FTCCI) నివేదికలోని సూచనలను అమలుకు తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, FTCCI పరిశోధనా బృందం డిప్యూటీ సీఈఓ సుజాత ఆధ్వర్యంలో రూపొందించిన పల్సెస్ (pulses Opportunities & Way Forward)పై రూపొందించిన నివేదికను సాయంత్రం హాకా భవన్ లో విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన అధ్యక్షులు రమాకాంత్ ఇనాని, సీఈఓ క్యాతి నరవనే తదితరులు