Hon’ble Minister for Agriculture review on Vanakalam Fertilizer.

Press Release
Please Cover
For Print & Electronic Media
తేది.19/05/2021, హైదరాబాద్.

*వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు, ఎన్ ఎఫ్ సీఎల్, క్రిబ్ కో, స్పిక్, ఐపీఎల్, ఆర్ సీ ఎఫ్, సీఐఎల్, ఎన్బీసీఎల్ ఎరువుల కంపెనీల ప్రతినిధులు , తదితరులు*

అన్ని జిల్లాలలో రైతులకు అందుబాటులో ఎరువులు

– రసాయనిక ఎరువులు వాడకం తగ్గించాలి

– షెడ్యూల్ ప్రకారం మన రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను కంపెనీలు ప్రతి నెలా డ్రా చేసి సకాలంలో సరఫరా చేయాలి

– రాష్ట్రంలో ఎరువుల నిల్వలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి

– మార్క్ ఫెడ్ వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఎప్పుడూ సిద్దంగా ఉంచుతున్నాము
– అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశాలు

– ఎరువుల నిల్వ కోసం అందుబాటులో ఉన్న గోదాములు అన్నింటినీ ఉపయోగించుకోవాలి

– వానాకాలం రాక ముందే రైల్వే రేక్ పాయింట్ల నుండి డిమాండ్ కు అనుగుణంగా అన్ని జిల్లాలకు ఎరువులు పంపించాలి

– కరోనా మూలంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు, ఎరువులు కంపెనీ యాజమాన్యాలు దృష్టి సారించాలి

– ఎరువుల సరఫరా విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను అందరూ పాటించాలి

– నోడల్ ఏజెన్సీలు, ఎరువుల కంపెనీలు, అధికారులు వాటికి అనుగుణంగా నడుచుకోవాలి

– వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు, ఎన్ ఎఫ్ సీఎల్, క్రిబ్ కో, స్పిక్, ఐపీఎల్, ఆర్ సీ ఎఫ్, సీఐఎల్, ఎన్బీసీఎల్ ఎరువుల కంపెనీల ప్రతినిధులు ,
తదితరులు.

Share This Post