Hon’ble Minister for Agriculture review on Vanakalam Seed availability in HACA Bhavan.

ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్

తేది.25/05/2021, హైదరాబాద్

*వానాకాలం సాగు – విత్తన లభ్యతపై హాకా భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు తదితరులు*

వానాకాలం సాగు అంచనా కోటీ 40 లక్షల ఎకరాలు

– దేశానికే తలమానికంగా తెలంగాణ విత్తనరంగం

– 13.06 లక్షల క్వింటాళ్ల వివిధరకాల విత్తనాలు అవసరం అని అంచనా

– అందుబాటులో 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనాలు .. అవసరానికి మించి విత్తన నిల్వలు

– 70.05 లక్షల ఎకరాలలో పత్తి , 20 లక్షల ఎకరాలలో కంది, 41 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా

– వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, పత్తి సాగును మరింతగా పెంచాలి .. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది

– 1.40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం .. జిల్లాలలో ఇప్పటికే అందుబాటులో 59.32 లక్షల పత్తి విత్తనాలు .. మిగిలిన విత్తనాలను క్లస్టర్ల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

– క్షేత్రస్థాయిలో క్లస్టర్ల వారీగా ఉన్న డిమాండ్ ను బట్టి ఆయా విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం

– మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లలో అకాలవర్షాల మూలంగా నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేదు .. అందువల్ల సోయాబీన్ విత్తనం మన ప్రభుత్వం సరఫరా చేయడం లేదు .. రైతులు దీనికి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి

– ప్రైవేటు డీలర్ల వద్ద సోయా విత్తనాలు కొనే రైతులు జాగ్రత్తగా నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే ఎంచుకోవాలి

– వచ్చే యాసంగిలో విచ్చలవిడిగా
వరి సాగు చేయవద్దు

– వేరుశనగ, నువ్వులు, ఆవాలు,  తదితర ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

– దీనిమూలంగా తక్కువ పెట్టుబడితో మార్కెట్లో డిమాండ్ ఉండడం మూలంగా రైతులకు అధికలాభం వస్తుంది

– ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలి

– పప్పు దినుసుల పంటల సాగును ప్రోత్సహించే దిశగా అంతరపంటగా వేసేందుకు ఉచితంగా ఎకరాకు రెండు కిలోల కంది విత్తనాలు

– డీలర్ల వద్ద రైతులు కొన్న ప్రతి దానికి రశీదులు తీసుకోవాలి

– లైసెన్స్ లేని వారి వద్ద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనకూడదని క్షేత్రస్థాయిలో రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలి

– పత్తిలో నకిలీ విత్తనాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి

– వానాకాలం సాగు – విత్తన లభ్యతపై హాకా భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు తదితరులు

Share This Post