Hon’ble Minister for Agriculture – Rythu Bandhu Distribution 5th Day Update.

Press Release
Please Cover

For Print & Electronic Media
తేది.19/06/2021, హైదరాబాద్

54.37 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.5145.87 కోట్లు జమ

– ఐదవరోజు 4.90 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1050.10 కోట్లు జమ

– మొత్తం 102.92 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం

– అత్యధికంగా నల్లగొండలో ఇప్పటి వరకు 3,97,260 మంది రైతులకు రూ.401.92 కోట్లు

– అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు రూ.19.68 కోట్లు

– నల్గొండ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,35,549 మంది రైతులకు రూ.254.62 కోట్లు, మూడోస్థానంలో సంగారెడ్డి జిల్లా 2,66,797 మంది రైతులకు రూ.247.67 కోట్లు

– రైతుబంధు సాయంతో రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన సాగు విస్తీర్ణం

– రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనం

– ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది

– తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం జరిగింది

– ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాములతో పాటు రైతు వేదికలు, కాటన్ మిల్లులు, అవకాశం ఉన్న ప్రతిచోటా ధాన్యం నిలువచేయడం జరిగింది

– వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన  ప్రాధాన్యత మూలంగానే ఇది సాధ్యం అయింది

– ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమయిందో అర్ధం చేసుకుని మాట్లాడాలి

– 2014 – 15 లో వానాకాలం, యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కేవలం 2021 ఈ యాసంగి లోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంల జరిగింది

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

 

Share This Post