Hon’ble Minister for Agriculture – Rythu Bandhu Distribution

ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా
తేది.17/06/2021, హైదరాబాద్

కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ

– రేపు 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ కానున్న రూ.1153.50 కోట్లు

– మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ

– నాలుగో రోజూ నల్లగొండకే అత్యధికం 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు

– అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు

– మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమకానున్న రూ.4095.77 కోట్లు

– కరోనా విపత్తులోనూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమే

– 60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయరంగానికి చేయూత నిస్తున్నారు

– రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నారు

– అందుకే కరోనా విపత్తులోనూ గత వానాకాలం, మొన్న యాసంగిలో కలిపి రూ. 14656.02 కోట్లు , ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది

– రైతుబంధు, ఉచితకరంటు , రైతుభీమా పథకాలతో తెలంగాణలో సాగు దశ – దిశ మారిందన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Share This Post