ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్
తేది.01/06/2021, హైదరాబాద్
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఒక కోటి 31 లక్షల 37 వేల ఎకరాలలో వ్యవసాయ, 9.62 లక్షల ఎకరాలలో ఉద్యానపంటలు ఉండేవి.
గడిచిన ఏడేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. 2 కోట్ల 3 లక్షల 80 వేల ఎకరాలలో వ్యవసాయ, 11.57 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపుతో తీసుకున్న రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు వంటి పథకాలు , వందశాతం పంటల కొనుగోలు, సాగునీటి సదుపాయం వంటి చర్యలతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయింది.
దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రమే పంటలు కొనుగోలు చేస్తుంది.
విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు వంటి రంగాలలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది.
కరోనా విపత్తులోనూ గత ఏడాది, ఈ ఏడాది రైతుబంధు, రైతుభీమా పథకాలను అమలుచేయడంతో పాటు వందశాతం పంటలు కొనుగోలు చేసి రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాబోయే కాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో నిరాటకంగా ముందుకు సాగుతుంది. అమరుల త్యాగాల పునాదుల మీద సాధించుకున్న తెలంగాణ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పునర్నిర్మాణమవుతుందని అన్నారు.