Hon’ble Minister for Agriculture VC With DGP About Spurious Seed.

Press Release
Please Cover

For Print & Electronic Media
తేది.12/06/2021, హైదరాబాద్.

*నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు , హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఐజీ నాగిరెడ్డి గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు, అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, డీఎస్పీలు, క్షేత్రస్థాయి పోలీసు అధికారులు,  జిల్లా వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, ఏఓలు తదితరులు*

తెలంగాణ కల్తీరహిత
విత్తన భాండాగారం  కావాలి

– అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం

– టాస్క్ ఫోర్స్ దాడులతో నకిలీ విత్తనాల తయారీదారుల్లో వణుకుపుట్టింది

– ఈ సీజన్ లో ఇప్పటి వరకు 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్ట్ చేయడం జరిగింది

– పీడీ యాక్ట్ కింద 32 కేసులు నమోదు చేయడం జరిగింది .. పదే పదే అక్రమాలు చేస్తున్న వారంతా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వారే

– కేసులు పెట్టినా తిరిగి పదే పదే అలవాటు ప్రకారం అక్రమాలు చేసే వారి మీద ప్రధానంగా దృష్టిపెట్టాలి .. అక్రమాలకు పాల్పడే వారిని వదలొద్దు, అమాయకులను వేధించొద్దు

– రశీదు మీద రైతు సంతకం లేనంత మాత్రాన అవి నకిలీ , నాణ్యతలేని విత్తనాలు కాదు .. వాటిపై 420 కేసులు బుక్ చేయొద్దు .. తర్వాత సంతకం తీసుకోవాలని దుకాణ యజమానులకు చెప్పాలి

– పత్తి విత్తన ప్యాకెట్లలో ఆర్ఐబి (refugee In Bag) శాతం మీద 420 కేసులు చేయాల్సిన అవసరం లేదు .. ఇందులో 5 నుండి 10 శాతం ఉండొచ్చు

– ప్రతి దానికి కేసులు నమోదు చేయొద్దు .. సరిదిద్దుకోగలిగిన తప్పుల విషయంలో సంబంధిత దుకాణాదారులు, విత్తన కంపెనీలకు సరిచేసుకోమని అదేశించాలి

– సరిదిద్దుకోలేని తప్పుల విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి .. కాలపరిమితి అయిపోయిన విత్తనాలు, హెచ్ టీ కాటన్ విత్తనాలు, లైసెన్స్ లేని అమ్మకందారుల విషయంలో కేసులు నమోదు చేయాలి

– పత్తి, మిరప విత్తనాల విషయంలో ప్రధానంగా దృష్టి సారించాలి

–  లైసెన్స్ ల జారీని సరళతరం చేసి నూతన విధానాలను తీసుకువస్తాం

– 1966 విత్తనచట్టం సమగ్రంగా లేదు .. నూతన వంగడాలకు తగినట్లు ఆ చట్టం లేదు

– జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో టాస్క్ ఫోర్స్ దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షించి భవిష్యత్ ప్రణాళికలను సిద్దం చేసుకుందాం

– నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు , హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఐజీ నాగిరెడ్డి గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు, అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, డీఎస్పీలు, క్షేత్రస్థాయి పోలీసు అధికారులు,  జిల్లా వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, ఏఓలు తదితరులు

– పీడీ యాక్ట్ కేసులు నమోదయిన నేరస్తుల మీద హిస్టరీ షీట్స్ తెరచి భద్రపరచాలని ఆదేశించిన డీజీపీ మహేందర్ రెడ్డి గారు

– క్షేత్రస్థాయిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అధికారులకు తగిన ఆదేశాలు ఈ రోజు జారీచేయడం జరుగుందని తెలిపిన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారు

–  మంత్రి గారి సూచనలను పరిగణనలోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ దాడుల సమయంలో అమలుపరచాలని పోలీస్ శాఖను ఆదేశించిన ఐజీ నాగిరెడ్డి గారు

Share This Post