Hon’ble Minister for Energy Video Conference on Pattana Pragathi

*ప్రచురుణార్ధం*

*పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి*

#సత్ఫాలితల సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు పాటించాలి

#సమీకృత వెజ్&నాన్ వెజ్ మార్కెట్ల

సముదాయాలనిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

#వైకుంఠధామాల నిర్మాణాలలో అలసత్వం వలదు

#మున్సిపాలిటీ భూములను పరిరక్షణకు చర్యలు

#పకడ్బందీగా రికార్డుల నిర్వహణ ఉండాలి

#పట్టణ ప్రకృతివనాల ఏర్పాటులో ముందుండాలి

#ఇండ్ల మీదుగా వెడుతున్న విద్యుత్ తీగల తొలగింపుకు నివేదికలు రూపొందించండి

#పట్టణ ప్రగతిలో విశ్రాంత ఉద్యోగులను భాగస్వామ్యం చేయండి

#పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలి

*-మంత్రి జగదీష్ రెడ్డి*

=======.==========

పట్టణప్రగతి పైసూర్యాపేట జిల్లా కేంద్రం నుండి నల్లగొండ,సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు,కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్.

పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,దేవరకొండ శాసనసభ్యులు రవీంద్రనాయక్ తదితరులు.

=================

ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణప్రగతి కార్యక్రామాన్ని  సమర్థవంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాల మున్సిపల్ చైర్మన్ లకు పిలుపునిచ్చారు.

పట్టణప్రగతి,పల్లె ప్రగతి లపై ప్రత్యేక కార్యాచరణ పధకాలను రూపొందించిన ప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు.కార్యక్రమంలో ఎదురౌతున్న లోటుపాట్లను సరిదిద్దుకుని విజయవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. తద్వారా మీరు కోరుకున్న రీతిలో అభివృద్ధి సాధ్యపదుతుందని ఆయన చెప్పారు.

జులై 1 నుండి 10 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతిపై మంగళవారం రోజున సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నుండి సూర్యాపేట,నల్లగొండ,యాదాద్రి జిల్లాల కలెక్టర్లు,మున్సిపల్ చైర్మన్లు,కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణప్రగతి పై సత్ఫాలితాలు సాదించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు పాటించాలన్నారు.పట్టణ ప్రాంతాల్లో సమీకృత వెజ్&నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన చెప్పారు. వైకుంటదామల నిర్మాణాలలో ఎంతమాత్రం అలసత్వం చూపరాదన్నారు.మున్సిపాలిటీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. భూముల రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు.పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటులో మున్సిపాలిటీలు ముందుండలన్నారు.ఇండ్ల మీదుగా వెడుతున్న విద్యుత్ తీగల తొలగింపుపై నివేదికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. అంతే గాకుండా పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.అంతే గాకుండా పట్టణ ప్రగతిలో ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులను భాగస్వామ్యం చెయ్యాలని అలాగే పట్టణ ప్రగతిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తనిఖీలు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.

  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు,  మున్సిపల్ చైర్ పర్సన్స్, జిల్లా కలెక్టర్లు టి. వినయ్ కృష్ణా రెడ్డి, యాదద్రి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు యస్. మోహన్ రావు,పాటిల్  హేమంత్ కేశవ్, దీపక్ తివారీ, రాజీవ్ శర్మ , మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

– Rameshbabu Kanchanapally

Share This Post