Hon’ble Minister for Labour and Employment inaugurated Two Newly Constructed Floors in ESI Nacharam Hospital.

 

 

Press Note
                                                                                                   Date: 18.06.2021

ESI నాచారం హాస్పిటల్ నూతన భవనం ను ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి శ్రీ చామకూర మల్లా రెడ్డి

         ఈ రోజు 18.06.2021 న ESI నాచారం హాస్పిటల్ నూతన భవనం లో 3rd -4th ఫ్లోర్ లను కార్మికులకు మెరుగైన సౌకర్యాలను అందించటానికి అందుబాటులోకి తెచ్చారు తెలంగాణ కార్మిక శాఖ మాత్యులు శ్రీ చామకూర మల్లా రెడ్డి గారు, ఉప్పల్ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. సత్యనారాయణ, కార్పొరేటర్లు శ్రీమతి. బొంతు శ్రీదేవి, దేవెందర్ రెడ్డి, శాంతి శేఖర్, బోర్డు మెంబర్ వేముల మారాయియహ, ఈ ఎస్సై వైద్యుల సంఘం అధ్యక్షులు డా. భాను, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వేణు, INTUC నాయకులు చారి, ఈఎస్సై డాక్టర్లు, ఇతర సిబ్బంది పాలగున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ లో ని 70 లక్షల మంది ఈఎస్సై కార్డు లబ్ది దారులకు మెరుగైన వైద్యం అందె విదంగా చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే నూతన భవనంలో అన్నీ వసతులు ఏర్పాటు  చేయటం జరిగినది. నూతన భవనంలో కార్పొరేట్ తరహా వైద్య సేవేలందించడమే కాకుండా ఇతర వార్డులను కూడా మార్చుతున్నామని తెలిపారు. కార్మికులకు మందుల కొరత రాకుండా మెరుగైన వైద్యం అందించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే సీ ఆర్ గారు కృషి చేస్తున్నారని, ఎంత బడ్జెట్ అయిన కేటాయించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మెడికల్, సర్జికల్, గైనకాలజీ వార్డులను సందర్శించి పేషంటులకు పండ్లు అంద చేశారు. ఈ ఎస్సై నాచారం ఆసుపత్రి సిబ్బంది సేవలను అభినందించారు. వైద్యులు, నర్సులు , ఈ ఎస్సై ఉద్యోగులకు కరొన కాలం లో సేవలు అందించినందుకు అభినందించటం జరిగినది.

–***–

 

Share This Post