పత్రిక ప్రకటన తేది: 7-7-2021
నారాయణ పేట
ఈ నెల 10వ తేదిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి మరియు ఐ.టి.శాఖ మంత్రి కె. తారక రామారావు నారాయణపేట జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నందున అందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డి. హరిచందన అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం టెలి కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి పర్యటన ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా నిర్వహించారు. జూలై, 10వ తేదిన సుమారు ఉదయం 10 గంటలకు విచ్చేసి మధ్యాహ్నం వరకు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసే అవకాశం ఉందన్నారు. టెక్స్టైల్ పార్క్, అమరవీరుల స్తూపం సమీకృత మార్కెట్ భవనం వంటి వాటికి శంఖుస్తాపనలు చేయడం తో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్య వార్డు, చిల్డ్రన్ పార్క్, సైన్స్ పార్క్ లను ప్రారంభోత్సవం చేస్తారని ప్రతి ప్రోగ్రాం కు ప్రత్యెక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తమకు ఇచ్చిన బాధ్యతలను పకడ్బందిగా నిర్వర్తిస్తు ప్రోటోకాల్ ను పక్కగా అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే. చంద్ర రెడ్డి సైతం అధికారులకు సలహాలు సూచనలు చేసారు.
————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నారాయణ పేట ద్వారా జారి చేయడమైనది.