Hon’ble Minister for PR & RD.

పౌల్ట్రి యూనిట్‌లు, డెయిరీ యూనిట్ల‌కు ఇంటి ప‌న్ను ను మిన‌హాయింపు

సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి ద‌యాక‌ర్ రావు

 

గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో ఉన్న పౌల్ట్రి యూనిట్‌లు, డెయిరీ యూనిట్ల‌కు ఇంటి ప‌న్ను ను మిన‌హాస్తూ  ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ , గ్రామీణవ‌`ద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు.  ఈ మేర‌కు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని తెలిపారు. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా పౌల్ట్రి య‌జ‌మానులు, డెయిరీ యూనిట్‌ల ఆస్తి ప‌న్నును ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నార‌ని ద‌యాక‌ర్ రావు గుర్తు చేశారు. వారి వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. దీని రాష్ట్రంలో పౌల్ట్రి రైతులు, డెయిరీ యూనిట్ లు వారు ఎంతో ల‌బ్ధిపొందుతార‌ని తెలిపారు. ఆస్తిపై హ‌క్కు పొంద‌డానికి  సంవ‌త్స‌రానికి వంద రూపాయ‌లు చెల్లిస్తే స‌రిపోతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ద‌యాక‌ర్ రావును ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని ద‌`ష్టిలో పెట్టుకొన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ నిర్ణ‌యం ద్వారా పౌల్ట్రి , డెయిరీ రంగంలో కొత్త వారు రావ‌డానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

Share This Post