హైదరాబాద్
For scrolling/Breaking
Media Release
DATE-25-06-2021
తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారని,గ్రామీణ ప్రజల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో విజయవంతంగా అమలు కావడానికి గ్రామ కార్యదర్శులు అంకితభావంతో చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉధ్బోదించారు.
హైదరాబాదులోని బంజారహిల్స్ లోని మినిష్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ బాధ్యులు పీ.ఆర్.సి. అమలు గురించి మంత్రి దయాకర్ రావుకు విజ్ఞాపన పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేవలం 3396 గ్రామ కార్యదర్శులు ఉండగా, ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక కార్యదర్శి ఉండాలనే సంకల్పంతో 9355 మందిని కాంట్రాక్టు పద్ధతిపై న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గా గత రెండేళ్ల క్రితం నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే గ్రామాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందని , ముఖ్యమంత్రి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులు నియమించి రెండేళ్లు కావస్తోందనీ ,నిర్ణీత గడువు పూర్తి కాగానే వారికి న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
జనాభా ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలలో గ్రామ కార్యదర్శికి పనిభారం తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న కారోబార్ లను గ్రామ కార్యదర్శులకు అసిస్టెంట్లుగా నియమించే ఆలోచన ప్రభుత్వం పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ,రాష్ట్ర,జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శుల కృషి వల్లనే పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 3 విడతల లో విజయవంతంగా నిర్వహించబడిందని ఆయన అన్నారు.ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి,మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం,పరిశుభ్రత పెంపొందించాలనే సంకల్పంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని తెలిపారు.
జూలై 1వ తేదీ నుండి 10 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో విజయవంతం చేయాలని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను 100% బ్రతికేలా శ్రద్ధ చూపాలని మంత్రి కోరారు.ప్రస్తుత వాన కాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాల్లో తడి ,పొడి చెత్తను గ్రామపంచాయతీలే ట్రాక్టర్లు, ట్రాలీల ద్వారా ప్రతిరోజూ సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు.
గ్రామాల అభివృద్ధికి గ్రామ సర్పంచ్ లతో కలిసి గ్రామ కార్యదర్శులు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి గ్రామ కార్యదర్శుల ప్రశంసించారు ,భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పని చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ను కూడా ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శుల అసోసియేషన్ బాధ్యులు కలిశారు.