Hon’ble Minister for R&B.

                                               

తేది:20-05-2021

ప్రెస్ రిలీజ్

ప్లీజ్ స్క్రోల్&కవర్

-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

కేసీఆర్ చేపట్టిన ఇంటింటి హెల్త్ సర్వే బ్రహ్మాండమైన కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వలే ఇంటింటి సర్వేలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అదేశాలిస్తున్నది

కేసీఆర్ నిర్ణయం వల్ల   తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా,మార్గదర్శకంగా నిలిచింది

ఇంటింటి సర్వే-లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో పాజిటివ్ రేటు 10శాతం తగ్గింది

బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్న వారిని..గాంధీ ఆస్పత్రి లేదా  కింగ్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్ కు పంపించాలి

బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో మా ఆఫీస్ స్టాఫ్ తో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలి

గతంలో జిల్లాలో 28 శాతం ఉన్న పాజిటివ్ రేటు ప్రస్తుతం 14 శాతానికి తగ్గింది

జిల్లా ఆస్పత్రిలో కొత్తగా 100, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో 70 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు కొనసాగుతోంది.. శనివారం లోపు పనులు పూర్తవుతాయి.

అలాగే దోమకొండ, మద్నూర్, ఎల్లారెడ్డి, బిచ్కుంద సిహెచ్ సి లలో 10 చొప్పున ఆక్సిజన్ బెడ్ల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా కలెక్టర్ శరత్ కు సూచించడం జరిగింది.

జిల్లా ఆస్పత్రిలో 5 వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచన మేరకు వైద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి.ప్రజలు ప్రయివేట్ హాస్పిటల్స్ వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు.

కోవిడ్ సమయంలో అన్ని త్యాగాలకు ఓర్చి పనిచేస్తున్న డాక్టర్స్,నర్సు,శానిటేషన్,ఇతర వైద్య సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఎంపీ బిబిపాటిల్ నిధులతో 30 ఆక్సిజన్ కాన్స్సేన్ ట్రేటర్స్ ఒక్కొక్కటి 50 వేల చొప్పున జిల్లాకు ఎంపీ గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇంటింటి సర్వే కార్యక్రమం ఫలితాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే చేయాలని ప్రధాని మోడీ ఆదేశించడం జరిగింది.

ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్ లు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తున్నారు.

కొత్తగా మండల స్థాయిలో ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

జిల్లాలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల సహకారంతో రేమిడిసివిర్,ఆక్సిజన్ కొరతను అధిగమించాం.

రెండో విడత ఇంటింటి జ్వర సర్వేలో ఇంటిలో ప్రతి వ్యక్తితో మాట్లాడాలి.

గ్రామపంచాయతీ వార్డు మెంబర్ ను టీమ్ సభ్యుడిగా చేర్చుకుని సర్వే చేయాలి.వారి ప్రత్యక్ష పరిచయాలతో సమగ్ర సమాచారం వచ్చే ఆస్కారం ఉన్నది.

లాక్డౌన్-ఇంటింటి సర్వే ద్వారా కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేయవచ్చు.

ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలి. ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదు.

డబుల్ మాస్కు,భౌతికదూరం,చేతులు తరుచూ సానిటైజ్ చేసుకోవడం లాంటివి పాటించాలి.

కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకవేళ కోవిడ్ వచ్చినా ప్రభుత్వం సర్వం సన్నద్దంగా ఉన్నది.

ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.

కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలతో ఉన్నది.

—కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు..

ఈ సమీక్ష సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి,డిఎంహెచ్ఓ,పలువురు అధికారులు.

Share This Post