“Hunt for Astoroid Search) క్విజ్ యొక్క ఫలితాలను జిల్లా కలెక్టర్ శ్రీ శరత్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రకటించడం జరిగింది.

*Hunt for Astoroid Search Quiz ఫలితాల వెల్లడి *

అంతరిక్షంలోని గ్రహ శకలాలను గుర్తించేందుకు పనిచేస్తున్న IASC( International Astronomical Search Collaboration) వారి ఉద్యమంలో పాల్గొనడానికి తెలంగాణాలో మొట్ట మొదటి సారిగా పాఠశాల విద్యార్ధులకు అవకాశం కల్పించబడింది.
ఈ ఉద్యమంలో పాల్గొనడానికి నిర్వహించిన “Hunt for Astoroid Search) క్విజ్ యొక్క ఫలితాలను జిల్లా కలెక్టర్ శ్రీ శరత్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రకటించడం జరిగింది.
ఈ పోటీలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులు పాల్గొన్నారు. కంప్యూటర్ సౌకర్యం కలిగి ఉన్న 64 మంది విద్యార్థుల నుండి 8 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ విద్యార్థులు సెప్టెంబర్/ అక్టోబర్ నెలల్లో జరగబోయే ” సప్తర్షి- విప్ నెట్ గ్రహా శకలాల శోధన ఉద్యమం”లో పాల్గొనే అవకాశం పొందుతారు.
ఇది విజ్ఞాన్ ప్రసార్, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ వారి సహకారంతో జరుగుతుంది.
ఈ గ్రహా శకలాల ఉధ్యమ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఖత్రి మెంటర్‌ మరియు జాతీయ కో- కన్వీనర్ గా వ్యవహరిస్తారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాద్యాయుడు రామన్ స్కాటర్స్ సైన్సు క్లబ్ నిర్వహకుడు శ్రీ పి. ప్రవీణ్ కుమార్ గారు టీం లీడర్ గా ఉంటారని తెలిపారు. వీరందరికి ఆగస్టు నెలలో కంప్యూటర్ మాధ్యమం ద్వారా శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డా॥శరత్ గారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యస్.రాజు గారు , DPRO శ్రీ వెంకటేశ్వర రావు గారు, సెక్టోరియల్ అధికారి శ్రీ వేణు శర్మ గారు ‘ DS0 శ్రీ సిద్ది రామరెడ్డి గారు మరియు కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ శ్రీ పి. ప్రవీణ్ కుమార్ గారు పాల్గొన్నారు.

Share This Post